రవిప్రకాశ్‌పై ఈడీ కేసు

209
raviprakash
- Advertisement -

టీవీ 9 మాజీ సిఈఓ రవిప్రకాష్ మరింత చిక్కుల్లో పడ్డారు. టివి 9 నుంచి సుమారు 18 కోట్ల రూపాయల మేర అనధికారికంగా రవిప్రకాష్ ,మరో ఇద్దరు తరలించారని గతంలో కేసు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సొమ్ముకు సంబందించే కేసు నమోదుకాగా తాజాగా ఈడీ( ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) కేసు నమోదుచేసింది.

ఏబీసీఎల్‌ నుంచి 2018-19 మధ్య కాలంలో రూ.18 కోట్లు అనుమతి లేకుండా ఉపసంహరించినట్లు ఆరోపణలు రావడంతో ఆ సంస్ధ ప్రతినిధుల ఫిర్యాదుమేరకు రవిప్రకాష్‌పై ఈడీ కొరడా ఝుళిపించింది.

ఈ కేసులోనే గత అక్టోబర్‌లో బంజారాహిల్స్‌ పోలీసులు రవిప్రకాశ్‌ను అరెస్టు చేయగా తర్వాత ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు.

- Advertisement -