ECS/NACH చార్జీలు ..అంటే తెలుసా?

25
- Advertisement -

ECS (ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సర్వీస్), NACH (నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్) వంటి ఆటోమేటెడ్ పేమెంట్ సిస్టమ్స్‌తో మనం రికరింగ్ చెల్లింపులు (Recurring Payments) సులభంగా నిర్వహించవచ్చు. ఇవి వ్యక్తిగత రుణాలు, యుటిలిటీ బిల్లులు, మ్యూచువల్ ఫండ్ SIPలు వంటి సర్వీసులకు పేమెంట్స్ ఆటోమేటిక్‌గా డెబిట్ అయ్యేలా చేస్తాయి.

కానీ, ఈ పేమెంట్లు విఫలమైనపుడు—అంటే ఖాతాలో సరిగా నగదు లేకపోవడం, తప్పు వివరాలు ఇవ్వడం లేదా సాంకేతిక సమస్యల వల్ల—ఖాతాదారులపై పెద్ద మొత్తంలో రిటర్న్ చార్జీలు విధించబడతాయి. ఇవే ECS/NACH రిటర్న్ చార్జీలు. ఈ రిటర్న్ ఫీజులు బ్యాంకును బట్టి మారుతూ ఉంటాయి. ఖాతా రకం, బ్యాంకు విధానాలు ఆధారంగా చార్జీలు వేరేలా ఉంటాయి:

Axis బ్యాంక్: మొదటి రిటర్న్‌కి ₹500, తర్వాత రిటర్న్లకు ₹550

Federal బ్యాంక్:

Savings Accounts: మొదటి రిటర్న్‌కి ₹250, తర్వాతదానికి ₹500

OD/CC ఖాతాలు: మొదటి రిటర్న్‌కి ₹350, తర్వాతదానికి ₹750

State Bank of India (SBI) మరియు Bank of India: ప్రతి రిటర్న్‌కి ₹250 + GST. ఒక నెలలో ఒక్కటి కాదు, అనేక లావాదేవీలు విఫలమైతే ఈ చార్జీలు భారీ మొత్తంగా మారుతాయి.

ECS/NACH రిటర్న్ చార్జీలు విధించే సందర్భాలు:

ఖాతాలో తగినంత బ్యాలెన్స్ లేకపోవడం

తప్పు లేదా కాలదాటి పోయిన మాండేట్ డిటేల్స్

సాంకేతిక లోపాలు

ఈ చార్జీలు సాధారణంగా రిఫండబుల్‌ కాదు. డైరెక్ట్‌గా ఖాతాలో నుంచి డెబిట్ అవుతాయి.

ఉదాహరణకు: మీరు ₹500 విలువ గల నాలుగు SIPలను నెలకు రెగ్యులర్‌గా పే చేయాలి అనుకుంటే, బ్యాలెన్స్ లేకపోవడం వల్ల ఇవి అన్నీ రిజెక్ట్ అయితే, రిటర్న్ ఫీజులు కలిపి ₹2360 వరకు వచ్చొచ్చు

ఈ రిటర్న్ చార్జీలను ఎలా నివారించాలి?

ప్రీ-డెబిట్ రోజు ముందే ఖాతాలో తగినంత బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలి.

పేమెంట్ షెడ్యూల్‌ను రెగ్యులర్‌గా ట్రాక్ చేయాలి.

బ్యాంక్ ఖాతా లేదా ఇతర వివరాలు మార్చినప్పుడు మాండేట్ అప్‌డేట్ చేయాలి.

బ్యాలెన్స్ తక్కువగా ఉన్నప్పుడు అలర్ట్స్ పొందేందుకు మొబైల్ బ్యాంకింగ్ అలర్ట్లు సెటప్ చేయాలి.

నోట్: ఈ వార్త కేవలం సమాచారం కోసమే..

Also Read:ఇలా ఈజీగా బరువు తగ్గండి!

- Advertisement -