మంచిర్యాల జిల్లాలో ఎకో టూరిజం సర్క్యూట్‌..

470
balka suman
- Advertisement -

ఢిల్లీలో కేంద్రమంత్రి ప్రహ్లాద్ సింగ్ పాటిల్‌ని కలిశారు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు. మంచిర్యాల జిల్లాలోని అన్నారం బ్యారేజ్,గట్టు మల్లన్న స్వామి ఆలయం,ఎల్లంపల్లి బ్యారేజ్,ఇందారం గ్రామం మరియు టీ జంక్షన్,గాంధారి ఖిల్లా,ఎల్లంపల్లి – కవ్వాల్‌ టైగర్ ఫారెస్ట్‌లను కలుపుతూ ఎకో టూరిజం సర్క్యూట్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

స్వదేశ్ దర్శణ్ పథకం ద్వారా చారిత్రాక నేపథ్యం కలిగిన ఈ ప్రాంతాలను ఎకో టూరిజం స్పాట్‌లుగా గుర్తించి అభివృద్ధి చేయాలని కోరారు. ఇందుకు సంబంధించిన డీపీఆర్‌ను త్వరలోనే అందిస్తామని వెల్లడించారు. కేంద్రమంత్రిని కలిసిన వారిలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్,ఎంపీలు రంజిత్ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి,వెంకటేష్ నేత,మాలోతు కవిత ఉన్నారు.

annaram

- Advertisement -