త్వరలో ట్రెయిన్‌లో ఎకానమీ ఏసీ కోచ్‌లు…

279
Economy AC trains soon
- Advertisement -

త్వరలో ట్రెయిన్‌లో ఎకానమీ ఏసీ కోచ్‌లు ఏర్పాటు కానున్నాయి. తృతీయ‌ శ్రేణి ఏసీ ఛార్జీలు కంటే తక్కువ ధరతో ప్రయాణించే ఎకానమీ ఏసీ కోచ్‌లను రైల్వే శాఖ త్వరలో ప్రారంభించనుంది. ప్రతిపాదిత రైళ్లలో మొదటి, రెండు, మూడో తరగతి ఏసీ భోగీలతోపాటు ఎకానమీ క్లాస్ కోచ్‌లు కూడా అదనంగా ఏర్పాటు చేయనున్నారు. వీటికి ఆటోమేటిక్ డోర్‌లు కూడా ఉంటాయి.

 Economy AC trains soon

అంతేకాదు ఇతర ఏసీ భోగీలతో పోల్చుకుంటే ఇందులో ఉష్ణోగ్రత 24- 25 డిగ్రీల మధ్యలో ఉంటుంది కాబట్టి బ్లాంకెట్ కూడా అవసరం లేదని రైల్వే వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఉన్న మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో స్లీపర్, మొదటి, ద్వితీయ, తృతీయ‌ శ్రేణి ఏసీ కోచ్‌లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే రాజధాని, శతాబ్ది, గరీభ్‌రథ్‌తోపాటు ఇటీవల ప్రవేశపెట్టిన హమ్‌సఫర్, తేజస్ మాత్రం పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ రైళ్లు.

ఎక్కువ మంది ప్రయాణీకులకు పూర్తిస్థాయి ఏసీ రైలు సౌకర్యాన్ని అందించాలనే లక్ష్యంతో ఎంపిక చేసిన మార్గాల్లో వీటిని ప్రారంభించాలని రైల్వే శాఖ ప్రయత్నిస్తోంది. దీనికి అనుగుణంగా రైళ్లు, రైల్వే స్టేషన్లలో సౌకర్యాలను మెరుగుపరిచి, మరింత సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పింది.

 Economy AC trains soon

ఇతర వాటితో పోల్చుకుంటే కొత్తగా ప్రవేశపెట్టే ఎకానమీ క్లాస్ ఏసీ భోగీల్లో సాధారణంగా 24 నుంచి 25 డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రత ఉంటుంది… దీని వల్ల ప్రయాణీకులకు సౌకర్యవంతంగా ఉంటుంది, బయటి ఉష్ణోగ్రత ప్రభావాన్ని కూడా తట్టుకుంటారని రైల్వే మంత్రిత్వశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇటీవల ప్రారంభించిన తృతీయ‌ శ్రేణి ఏసీ కోచ్‌ హమ్‌సఫర్ రైలు విజయవంతమైంది.

అలాగే ఎకానమీ ఏసీ రైలు కూడా ప్రయాణికులను ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తిస్థాయి వివరాలను ఉత్పత్తి ప్రారంభానికి ముందు వెళ్లడిస్తామని రైల్వే అధికారులు తెలిపారు.

- Advertisement -