ఈవీఎంలతోనే వచ్చే లోక్‌సభ ఎన్నికలు…

246
sunil arora
- Advertisement -

ఈవీఎంలతోనే వచ్చే లోక్‌ సభ ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ఈవీఎంలు ట్యాంపరింగ్‌ చేయుచ్చు అని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదన్నారు. ఏదిఏమైనా ఈవీఎంల స్ధానంలో బ్యాలెట్ పేపర్లను వినియోగించే ప్రసక్తేలేదన్నారు.

ఈవీఎంలపై ఎలాంటి విమర్శలు, వివాదాలను ఎదుర్కొనేందుకైనా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈవీఎంల పనితీరుపై ఏ రాజకీయ పార్టీకి అయినా అభ్యంతరాలు, అనుమానాలు ఉంటే.. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయవచ్చని సునీల్ అరోరా చెప్పారు.

ఈవీఎంలేం ఫుట్‌బాల్‌ కాదు. దేశంలో రెండు దశబ్దాలుగా ఈవీఎంలను ఉపయోగిస్తున్నాం. రాజకీయ పార్టీల డిమాండ్ల దృష్ట్యా ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు వీవీప్యాట్‌ యంత్రాలను కూడా తీసుకొచ్చామన్నారు.

ఎన్నికల్లో ఉపయోగించే ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు(ఈవీఎం)లను హ్యాకింగ్‌ చేయొచ్చని, 2014 ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరిగిందంటూ సైబర్‌ నిపుణుడిగా చెప్పుకున్న సయ్యద్‌ షుజా ఇటీవల చేసిన ఆరోపణలు రాజకీయ దుమారానికి దారితీశాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో ఈవీఎంలకు బదులుగా పేపర్‌ బ్యాలెట్లే వాడలంటూ విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2019 సార్వత్రిక ఎన్నికలపై క్లారిటీ ఇచ్చారు సునీల్ అరోరా.

- Advertisement -