- Advertisement -
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ పథకాలకు నిధుల విడుదలకు బ్రేక్ వేసింది ఈసీ. ఎన్నికలు పూర్తయ్యే వరకు డబ్బు జమ చేయవద్దని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
గత ఐదేళ్ల నుంచి అమలవుతున్న పథకాలు.. చేయూత, ఫీజు రీయింబర్స్ మెంట్, రైతులకు సంబంధించిన ఇన్ పుట్ సబ్సిడీ పథకాలకు సంబంధించిన నిధుల విడుదలకు అనుమతి కోరుతూ ఈసీకి ప్రభుత్వం లేఖ రాసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఈసీ అనుమతి తప్పనిసరి.
ఆ మూడు పథకాల అమలు ఆపేయాలని, లబ్దిదారులకు నిధులు జమ చేయొద్దని వెల్లడించింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు నిధుల విడుదలకు అనుమతి ఇచ్చేది లేదని ఈసీ తేల్చి చెప్పింది. తుపాను, కరవు కారణంగా నష్టపోయిన రైతులకు అందే ఇన్ పుట్ సబ్సిడీని కూడా విడుదల చేయకూడదని ఆదేశించింది.
Also Read:డైరెక్టర్ సుకుమార్ @ 20
- Advertisement -