జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు కసరత్తు ..!

7
- Advertisement -

హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కసరత్తు ప్రారంభించింది ఎన్నికల కమిషన్. జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌ కార్యక్రమం వచ్చే నెల 2 నుంచి 17 వరకు నిర్వహించనున్నట్లు కమిషనర్‌ ఆర్వీ కర్ణన్ తెలిపారు.

జూలై 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు తప్పనిసరిగా ఓటరు నమోదు చేసుకోవాలన్నారు. సెప్టెంబర్‌ రెండు నుంచి 17 వరకు క్లెయిమ్స్‌ అండ్‌ అబ్జెక్షన్‌ అవకాశం ఉందన్నారు. సెప్టెంబర్‌ 25 వరకు క్లెయిమ్స్‌ అండ్‌ అబ్జెక్షన్‌ డిస్పోజల్‌ చేస్తామని చెప్పారు.

సెప్టెంబర్‌ 30 వరకు ఓటరు జాబితా ఫైనల్‌ పబ్లికేషన్‌ చేస్తామని కమిషనర్‌ వారికి వివరించారు. స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌లో రాజకీయ ప్రతినిధులు సహకరించి ఈ ప్రక్రియను విజయవంతం చేయాలని కమిషనర్‌ కోరారు.

Also Read:నామినేషన్ వేసిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి

- Advertisement -