రేవంత్‌కు ఈసీ నోటీసులు

231
Revanth Reddy
- Advertisement -

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ రేవంత్ రెడ్డిపై ఈసీ ఫైరైంది. కొడంగల్‌లో భయాందోళనలు సృష్టించి, సీఎం కేసీఆర్ సభను అడ్డుకోవడానికి బంద్‌కు పిలుపునివ్వడం సబబు కాదని తెలిపింది. ఈ మేరకు టీఆర్ఎస్‌ ఫిర్యాదుపై స్పందించిన ఈసీ..తెలంగాణ డీజీపీకి లేఖరాసింది. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని సీఎం సభకు బందోబస్తు కల్పించాలని సూచించింది. రేవంత్‌కు నోటీసులు జారీ చేసిన ఈసీ..కొడంగల్‌లో రెండు రోజుల పాటు 144 సెక్షన్‌ను విధించింది.

కొండారెడ్డిపల్లిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడిన రేవంత్…తనను అడ్డుకోవడం హరీశ్‌రావు, కేటీఆర్‌ వల్ల సాధ్యం కాకే కేసీఆర్‌ రంగంలోకి దిగారని పేర్కొన్నారు. కేసీఆర్‌ పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు.

కేసీఆర్‌ పర్యటనను అడ్డుకుంటామని వ్యాఖ్యానించడంపై టీఆర్‌ఎస్‌ నేతలు ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. రేవంత్‌ ఎన్నికల ప్రక్రియకు విఘాతం కల్గిస్తున్నారని ఆరోపించారు. ఆయన ఉద్దేశపూర్వకంగా ప్రజలను రెచ్చగొడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రేవంత్ మాట్లాడిన వీడియోను ఈసీకి అందించింది. దీంతో రేవంత్‌పై ఈసీ సీరియసైంది.

- Advertisement -