సంక్షేమ కార్యక్రమాలు నిలిపివేయండి..ఈసీ ఆదేశం

20
- Advertisement -

జగనన్న పాలనలో అమలు చేస్తున్న పథకాలను నిలిపివేసింది ఈసీ.మొన్నటి మొన్న వృద్దులకు పెన్షన్లు అందకపోవడం వల్ల ఎండల్లో బ్యాంకులు చుట్టూ ఎంతలా తిరిగారో చూశాం. ఇప్పుడు మరో దెబ్బ తగిలినట్టు అయ్యింది.

జగనన్న ప్రభుత్వంలో అమలవుతున్న విద్యార్ధుల ఫీజు రీ ఎంబర్స్ మెంట్, విద్యాదీవెన, ఇన్ పుట్ సబ్సిడీ వంటి పథకాలను పేదలకు చేరకుండా ఈసీకి ఫిర్యాదులు చేయడం జరిగింది. దీంతో సంక్షేమ పథకాలకు నిధులు విడుదల కాకుండా ఈసీ ఆదేశించడం కూడా జరిగింది

ఫలితంగా తుఫాను, కరువు కారణంగా దెబ్బతిన్న రైతులకు అందే సబ్సిడీ ఇవ్వడానికి ఈసీ మోకాలడ్డినట్టు అయ్యింది. మరోపక్క ఖరీఫ్ కు సన్నద్దమవుతున్న రైతులకు అందే సబ్సిడీ కూడా నిలిచిపోయింది. విద్యార్ధులకు ఇచ్చే ఫీజు రీయంబర్స్ మెంట్ నిధులు నిలిచిపోయాయి.

ఇదంతా ‘చంద్రబాబు ఫిర్యాదు చేయడం వల్లే జరిగిందని, పేదలపై ఆయన పగబట్టారని, ఆయన్ని తరిమేసే రోజులు అసన్నమవుతున్నాయని, ఒక్క నెల రోజులు ఓపిక పడితే మళ్ళీ జగనన్న పాలన వచ్చి పేదల జీవితాల్లో వెలుగులు వస్తాయని’ కొందరు అభిప్రాయపడుతున్నారు.

Also Read:TDP:పాపం చంద్రబాబు

- Advertisement -