బయటిఫుడ్ తింటున్నారా..అయితే మీకోసమే!

5
- Advertisement -

బయటి ఫుడ్ తింటున్నారా అయితే మీకోసమే. ఆహార నాణ్యత ప్రమాణాల పర్యవేక్షలో దేశంలో తెలంగాణ చాలా వెనుకబడి ఉంది. ఆహార నాణ్యత ప్రమాణాల్లో నిర్దేశించిన మార్గదర్శకాల్లో పలు అంశాల్లో తెలంగాణ 23వ స్థానంలో నిలిచింది.

ఆహార తయారీలో వివిధ అంశాలను పరిశీలించి మార్కుల ప్రాతిపదికగా నాణ్యత తనిఖీలపై ర్యాంకులను ప్రకటించగా 100 మార్కులకు తెలంగాణ 35.75 మార్కులు సాధించి 23వ స్థానంలో ఉంది.

జనాభాకు తగిన మేర ఆహార నాణ్యాత తనిఖీ ఉద్యోగులు, సిబ్బంది లేకపోవడం, రాష్ట్ర స్థాయి సలహా కమిటీ ఏర్పాటు, సమావేశాల నిర్వహణకు సంబంధించిన ప్రమాణాల్లో సగం కంటే తక్కువ ఉన్నట్లు తెలిపింది. వినియోగదారుల ఫిర్యాదులు తీసుకోవడం, సహాయ కేంద్రాల ఏర్పాటు వంటి అంశాల్లో రాష్ట్రం చాలా వెనకబడి ఉండటం ప్రధాన కారణం. ఆహార నాణ్యత ప్రమాణాల విషయంలో కేరళ అగ్రస్థానంలో ఉండగా, తమిళనాడు రెండో స్థానంలో ఉంది.

Also Read:స్కందగిరి ఆలయంలో గుడి గుడికో ఓ జమ్మి చెట్టు

- Advertisement -