బెల్లం తినడం వలన కలిగే లాభాలు..

434
- Advertisement -

బెల్లంలో ఆరోగ్యానికి మేలు చేసే ప్రయోజనాలెన్నో వున్నాయి. ప్ర‌ధానంగా క‌డుపునొప్పి త‌గ్గాలంటే… వేడి పాలలో బెల్లం వేసుకుని తాగాలి. అనీమియాను ఇది దూరం చేస్తుందట. పాలను తాగడం ద్వారా రక్తహీనతను దూరం చేసుకోవచ్చు. అందులో బెల్లం కాస్త కలుపుకుని సేవిస్తే బరువు తగ్గుతారు. బెల్లం క‌లిపిన వేడి పాలలో స‌హ‌జ సిద్ధ‌మైన యాంటీ బ‌యోటిక్‌, యాంటీ వైర‌ల్ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల అవి అనారోగ్యాల‌ను క‌లిగించే వైర‌స్‌లు, బాక్టీరియాల భ‌ర‌తం ప‌డ‌తాయి. దీంతో ప‌లు ఇన్‌ఫెక్ష‌న్లు త‌గ్గుతాయి. శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి కూడా పెరుగుతుంది.

బెల్లం తినడం వల్ల శ‌రీరంలో పేరుకుపోయిన అధిక కొవ్వును త‌గ్గిస్తాయి. ఇలా చేస్తే జుట్టు కాంతివంతంగా మారుతుంది. హెయిర్ ఫాల్ ఉండదు. చుండ్రు మటాష్ అవుతుంది. కీళ్ళ నొప్పులు దూరమవుతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలోనే నిత్యం రాత్రి పూట భోజనం చేశాక ఒక చిన్న బెల్లం ముక్కను రోజూ తింటే మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. రోజూ రాత్రి భోజనం చేశాక ఒక చిన్న బెల్లం ముక్కను తింటే జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది. బెల్లంలో ఉండే ఔషధ గుణాలు జీర్ణాశయంలోని పలు డైజెస్టివ్ ఎంజైమ్‌లను యాక్టివేట్ చేస్తాయి. దీని వల్ల మనం తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది.

2. బెల్లం మన శరీరంలోని లివర్‌కు ఎంతగానో మేలు చేస్తుంది. లివర్‌ను శుభ్ర పరిచేందుకు బెల్లం పనికొస్తుంది.

3. బెల్లంలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల దీన్ని తింటే శరీరంలో ఎలక్ట్రోలైట్స్ సమతుల్యంలో ఉంటాయి. దీంతో కండరాల నిర్మాణం సరిగ్గా ఉంటుంది. శరీర మెటబాలిజం సరిగ్గా ఉంటుంది.

4. బెల్లం తినడం వలన ఒంట్లో అధికంగా ఉండే నీరు బయటకు వెళ్లిపోతుంది. అధిక బరువు తగ్గుతారు. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.

Also Read:తొందరపడొద్దు…ఎమ్మెల్యేలతో కేసీఆర్

5. నిత్యం బెల్లంను తింటుంటే లివర్‌లో ఉండే హానికర వ్యర్థాలు, విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. దీంతో లివర్ శుభ్రంగా ఉంటుంది. లివర్ సంబంధ అనారోగ్యాలు రాకుండా ఉంటాయి.

6. బెల్లం తింటే మలబద్దకం, గ్యాస్, అసిడిటీ సమస్యలు కూడా దూరమౌతాయి.

- Advertisement -