ఐస్ క్రీమ్ తింటున్నారా..జాగ్రత్త!

25
- Advertisement -

పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా తినే శీతల పదార్థాలలో ఐస్ క్రీమ్ మొదటి స్థానంలో ఉంటుంది. మరి ముఖ్యంగా వేసవిలో ఐస్ క్రీమ్ ను అమితంగా తింటూ ఉంటారు. ఐస్ క్రీమ్ లలో చాలానే రకాలు ఉన్నాయి, వెనీలా, స్ట్రాబెర్రీ, చాక్లెట్, మ్యాంగో.. ఇలా ఎవరికి ఇష్టమైనది వారు తింటూ ఉంటారు. అయితే ఐస్ క్రీమ్ ఎక్కువగా తింటే ఆరోగ్యానికి ముప్పే అంటున్నారు నిపుణులు. అందుకే వేసవిలో ఐస్ క్రీమ్ తినే విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఐస్ క్రీమ్ తయారీలో పాలు, చక్కెర, చాక్లెట్, డ్రై ఫ్రూట్స్, చెర్రీస్ ఇలా చాలానే ఉపయోగిస్తుంటారు. వీటి వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికి.. ఇందులో యూస్ చేసే చక్కెర కారణంగా నష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు నిపుణులు..

ఐస్ క్రీమ్ లలో షుగర్ కంటెంట్ తో పాటు కెలోరీలు, కొవ్వు పదార్థాలు కూడా అధికంగా ఉంటాయి. అందువల రక్తంలో చక్కెర స్థాయి పెరిగి రక్తపోటు, డయాబెటిస్ వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇంకా ఇందులో ఉండే కెలోరీలు, కార్బోహైడ్రేట్ల కారణంగా త్వరగా బరువు పెరిగే అవకాశం ఉంది. అధిక బరువు కారణంగా శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోయి స్థూలకాయానికి దారి తీస్తుంది. ఐస్ క్రీమ్ తినడం వల్ల జ్ఞాపకశక్తి కూడా తగ్గుతునట్లు నివేధికలు చెబుతున్నాయి.

ఇవి మాత్రమే కాకుండా దంతాలు పుచ్చిపోవడం, చిగుళ్ళు దెబ్బ తినడం వంటి సమస్యలు కూడా ఉత్పన్నమౌతాయట. ఇంకా అతిగా ఐస్ క్రీమ్ లు తింటే జీర్ణ వ్యవస్థ కూడా దెబ్బ తింటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఐస్ క్రీమ్ తినడం వల్ల లాభాలు కూడా ఉన్నాయి. వేసవిలో దీనిని తినడం ద్వారా మైండ్ రిఫ్రెష్ అవుతుంది. బాడీ టెంపరేచర్ తగ్గుతుంది. ఇంకా ఐస్ క్రీమ్ తయారీలో ఉపయోగించే పదార్థాల వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. కాబట్టి ఐస్ క్రీమ్ మితంగా తింటే ఆరోగ్యమే. రోజుకు ఒకటి లేదా రెండు తినడం మంచిదే. అంతకు మించి ఎక్కువ తింటే నష్టాలు తప్పవు.

Also Read:TTD:సప్తవర్ణశోభితం శ్రీవారి పుష్పయాగం

- Advertisement -