తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వైరల్ హడలెత్తిస్తోంది. వైరస్ కారణంగా వేల సంఖ్యలో కోళ్లు చనిపోయాయి. కోళ్ల మరణాలకు ఏవియన్ ఇన్ ప్లూయెంజా (హెచ్5ఎన్1 – బర్డ్ ప్లూ) వైరస్ కారణమని తెలిసింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని వేల్పూరు, తూర్పు గోదావరి జిల్లాలోని కానూరు అగ్రహారంలోని కోళ్లను పూడ్చిపెట్టడమే కాదు కిలో మీటరు వరకు రెడ్ అలర్ట్ ప్రకటించారు.
ఏపీలో బర్డ్ ప్లూ కేసులు వెలుగులోకి రావడంతో తెలంగాణ ప్రభుత్వంసైతం అప్రత్తమైంది. రాష్ట్రంలోకి ఈ వైరస్ వ్యాపించకుండా అధికారులు చర్యలు చేపట్టారు. కోళ్ల పెంపకందారులు, పౌల్ట్రీ పరిశ్రమ ప్రతినిధులతో సమావేశమై బర్డ్ ప్లూ వ్యాప్తి, తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.
ఏపీలో బర్డ్ ప్లూ పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో చికెన్, గుడ్లు తినే విషయంపై ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. కోడి మాంసం, గుడ్లు తినవచ్చా అని సందేహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక సూచన చేసింది.
వైరస్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని రోజులు చికెన్ తినవద్దు అని తెలంగాణ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.
Also Read:అలెర్ట్… కొన్ని రోజులు చికెన్ తినొద్దు!

