తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్, ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ , వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, మంచిర్యాల, భద్రాద్రి జిల్లాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. హఠాత్తుగా భూమి కంపించటంతో ప్రజలు హడలిపోయారు. అసలేం జరగుతోందో అర్థం కాక.. భయంతో వణికిపోయారు.
హైదరాబాద్, ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ , వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, మంచిర్యాల, భద్రాద్రి జిల్లాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. హఠాత్తుగా భూమి కంపించటంతో ప్రజలు హడలిపోయారు. అసలేం జరగుతోందో అర్థం కాక.. భయంతో వణికిపోయారు.
ఇవాళ ఉదయం 7.25 గంటల నుంచి 7.28 గంటల మధ్య భూమి కంపించింది. భూ ప్రకంపనలతో ప్రజలు ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూప్రకంపనల ధాటికి ఏటూరు నాగారంలో ఇల్లు గోడ కూలిపోయింది. భూమి లోపల 40 కి.మీ లోపల ఈ రేడియేషన్ ఉద్భవించి ఉంటుందని అధికారులు తెలిపారు.
మహారాష్ట్ర, ఛత్తీస్‌గడ్‌లోనూ భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. గడ్చిరౌలి జిల్లాలోని పలు ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు.
Also Read:బ్యాంకింగ్ బిల్లు.. ఇకపై ఒక ఖాతాకు నలుగురు నామినీలు