- Advertisement -
అండమాన్ నికోబార్ దీవుల్లో మరోసారి భూమి కంపించింది. ఇవాళ ఉదయం 5.56 గంటలకు అండమాన్ సముద్రంలో భూకంపం సంభవించగా రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.6గా నమోదయింది. భూఅంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో భూమి పొరలు కదిలాయని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది.
సోమవారం ఉదయం నుంచి అండమాన్ దీవుల్లో భూమి కంపించడం ఇది 22వసారి. సోమవారం ఉదయం 5.42కు ప్రారంభమైన భూకంపాల పరంపర కొనసాగుతున్నది. 3.8 నుంచి 5.0 తీవ్రతతో భూకంపాలు సంభవిస్తున్నాయి.
- Advertisement -