రాష్ట్ర ప్రజలకు ‘ప్రపంచ ధరిత్రీ దినోత్సవ’ శుభాకాంక్షలు: సీఎం కేసీఆర్

134
cm kcr
- Advertisement -

సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు ‘ప్రపంచ ధరిత్రీ దినోత్సవ’ శుభాకాంక్షలు తెలిపారు. ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి’ అన్న రామాయణంలోని సూక్తి ప్రేరణగా మనం నివసిస్తున్న ప్రాంతం పట్ల అభిమానాన్ని పెంచుకొని, పర్యావరణాన్ని కాపాడుకోవడానికి పూనుకోవాలన్నారు. ధరిత్రీ రక్షణ చర్యల్లో భాగంగా తెలంగాణను పచ్చగా మార్చేందుకు, రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న “తెలంగాణకు హరితహారం” కార్యక్రమం విజయవంతంగా నడుస్తున్నదని సీఎం తెలిపారు.

‘పల్లె ప్రగతి’, ‘పట్టణ ప్రగతి’లలో భాగంగా పరిశుభ్రత-పచ్చదనం కార్యక్రమాలు విజయవంతంగా అమలవుతున్నాయన్నారు.ధరిత్రి సంరక్షణ పట్ల మనం ఎంత బాధ్యతగా వ్యవహరిస్తే… భవిష్యత్తు తరాలకు మనం అంత ఆనందం పంచినవాళ్లమౌతామని, గుణాత్మక జీవనాన్ని అందించిన వారమౌతామని సీఎం రాష్ట్ర ప్రజలకు ధరిత్రీ దినోత్సవం సందర్భంగా పిలుపునిచ్చారు.

- Advertisement -