ఇకపై రోజుకు 25 గంటలు..ఎందుకో తెలుసా?

11
- Advertisement -

వాతావరణంలో సంభవిస్తున్న మార్పులు అనేక కొత్త కొత్త విషయాలకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా ప్రకృతి ప్రకోపానికి ఊహించని విళయాలు ఇప్పటివరకు చూశాం. మనదేశంలోనే కాదు ప్రపంచ దేశాలను విపత్తులు ముంచేస్తున్నాయి. ఇక ఇప్పటివరకు మనం వారం అంటే ఏడు రోజులు, సంవత్సరం అంటే 365 రోజులు, ఒక రోజుకు 24 గంటలు.

కానీ ఇకపై ఆ లెక్క మారనుంది.కొన్నాళ్లలో భూమిపై ఒక్కరోజుకు 25 గంటల సమయం కానుందట. ఇటీవల శాస్త్రవేత్తలు నిర్వహించిన ఈ పరిశోధనలో ఆసక్తికర విషయం వెల్లడైంది. దీనికి ప్రధాన కారణం భూమికి చంద్రుడు దూరంగా వెళ్లపోతుండడమేనట.

విస్కాన్సిన్-మాడిసన్ విశ్వవిద్యాలయం నిర్వహించిన పరిశోధనలో అనేక విషయాలు వెల్లడయ్యాయి. చంద్రుడు భూమి నుంచి ఏడాదికి సుమారు 3.8 సెంటీమీటర్ల చొప్పున వెనక్కి తగ్గుతుండటంతో భవిష్యత్తులో రోజుకు 25 గంటలు అంటే ఒక గంట పెరుగుతుందని చెబుతున్నారు. అయితే ఈ మార్పు జరగడానికి దాదాపు 200 మిలియన్ సంవత్సరాలు పడుతుందని అంచనా వేస్తున్నారు.

భూమి, చంద్రుడికి మధ్య గల గురుత్వాకర్షణలో మార్పుల వల్ల భూమికి చంద్రుడికి మధ్య దూరం పెరగడం వల్ల రోజుకు సమయం పెరుగుతుంది. పురాతన భౌగోళిక నిర్మాణాలు, అవక్షేప పొరలను పరిశీలించడం ద్వారా శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని వెల్లడించారు.

Also Read:తెలంగాణలో పెరిగిన అటవీ విస్తీర్ణం: సంతోష్ కుమార్

- Advertisement -