ఉదయం లేవగానే తలనొప్పి వస్తోందా?

73
- Advertisement -

నేటి బిజీలైఫ్ లో మారుతున్న జీవన విధానం కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు మన చుట్టూ ముడుతున్నాయి. టైమ్ కి ఆహారం తీసుకోకపోవడం, సరిగ్గా నిద్ర పోకపోవడం, వ్యాయామం చేయకపోవడం వంటి ఎన్నో కారణాల వల్ల ఆరోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. ఉదయం లేవగానే త్వరత్వరగా రెడీ అయి.. హడావిడిగా ఆఫీస్ కు బయలుదేరుతూ ఉంటారు. ఇక ఆఫీస్ అయిపోయిన ఇంటికి వచ్చిఫోన్ చూస్తూ నైట్ అంతా సమయం గడిపేస్తూ శరీరానికి కావలసిన విశ్రాంతి ఇవ్వరు..

దీంతో నిద్రలేమి, మానసిక ఒత్తిడి, బద్దకం, అలసట వంటి ఎన్నో సమస్యలు మన చుట్టూ ముడుతాయి. అయితే చాలమంది ఉదయం నిద్ర లేవగానే తలనొప్పితో భాదపడుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఈ సమస్య కాస్త అధికంగానే ఉంటుంది. అయితే ఇలా ఉదయాన్నే తలనొప్పి రావడానికి చాలానే కారణాలు ఉన్నాయి. పై విధంగా చెప్పుకున్నట్లు నిద్రలేమి, డీహైడ్రేషన్, ఒత్తిడి, శరీరం ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుట, రక్తం తక్కువగా ఉండడం, శరీరంలో నీటి శాతం తక్కువగా ఉండడం.. ఇలా చాలా కరణలనే చెప్పుకోవచ్చు. ఇక నైట్ అంత పని చేసే వారికి ఉదయం లేవగానే ఈ తలనొప్పి సమస్య ఎక్కువగా వేదిస్తూ ఉంటుంది.

అయితే కొన్ని సూచనలు పాటిస్తూ.. ఈ సమస్యను చాలా ఈజీగా అధిగమించవచ్చు. తలనొప్పిని తగ్గించడానికి ఒక గ్లాస్ నీటిలో నిమ్మరసం కలిపి ప్రతిరోజూ తాగడం వల్ల తలనొప్పి సమస్య దూరం అవుతుంది. అంతే కాకుండా రోజుకు 8 గంటలు కచ్చితంగా నిద్రపోవడంతో పాటు ప్రతిరోజూ వ్యాయామం, యోగా, ద్యానం వంటివి చేయడం వల్ల ఈ తలనొప్పి సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. ఇక ప్రతిరోజూ పడుకునే ముందు మొబైల్ కు దూరంగా ఉండాలి. ఎలాంటి ఒత్తిడిని దారి చేరనివ్వకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకుంటూ హాయిగా నిద్రపోవాలి. తద్వారా ఉదయం నిద్ర లేవగానే ఎలాంటి తలనొప్పి సమస్య ఉండదు.. అంతే కాకుండా రోజంగా యాక్టివ్ గా కూడా ఉండవచ్చు.

Also Read:అండమాన్ నికోబార్ దీవుల్లో దేవర!

- Advertisement -