ఉదయాన్నే తలనొప్పి వస్తే..ఇలా చేయండి!

33
- Advertisement -

తలనొప్పి అనేది చాలా సాధారణమైన సమస్య. తదేకంగా ఆలోచించే వారికి, తీవ్రమైన పనిభారం ఉన్నవారికి, నిద్ర లేమి సమస్యతో భాదపడే వారికి తలనొప్పి సమస్య ఎక్కువగా వేధిస్తూ వుంటుంది. అయితే ఇలా తలనొప్పి రావడానికి ఇంకా చాలానే కారణాలు ఉన్నాయి. రాత్రే సమయాల్లో ఎక్కువగా మద్యం సేవించే వారికి కూడా ఉదయాన్నే తలనొప్పి వేధిస్తుంది. దీన్నే హ్యాంగ్ఓవర్ అంటూ ఉంటారు. అయితే తలనొప్పి వచ్చినప్పుడు దాన్ని సాధారణ సమస్యగా తీసుకొని మెడిసన్ వేసుకొని తక్షణ ఉపశమనం పొందుతూ ఉంటారు. అయితే తలనొప్పిలో కూడా రకాలు ఉన్నాయి, మైగ్రేన్, క్లస్టర్, సైనస్ వంటివి తలనొప్పిలో రకాలుగా చెప్పుకోవచ్చు..

మైగ్రేన్ సమస్య ఉన్నవాళ్లకు తలనొప్పితో పాటు వికారం, వాంతులు, అలసట వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఇక క్లస్టర్ గా పిలువబడే తలనొప్పిలో కళ్ల చుట్టూ మంటగా కూడా ఉంటుంది. ఇక సైనస్ గా పిలువబడే తలనొప్పిలో ముక్కు బిగుతుగా మారడం, కళ్లచుట్టూ మంట, నుదిటిపై సూదులతో గుచ్చినట్లు ఉండడం ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఉదయం నిద్ర లేవగానే ఈ తలనొప్పి సమస్యలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.

Also Read:10 నిమిషాలు పరిగెత్తితే..ఎన్ని ప్రయోజనాలో!

అయితే కొన్ని సూచనలు, జాగ్రత్తలు పాటించడం వల్ల తలనొప్పి సమస్య నుంచి ఈజీగా బయటపడవచ్చు. మైగ్రేన్ సమస్య ఉన్నప్పుడూ తలపై కోల్డ్ ప్యాక్ ఉంచడం, ఎలాంటి ఒత్తిడి లేకుండా చూసుకోవడం ద్వారా తలనొప్పి సమస్య తగ్గుతుంది. ఇంకా టెన్షన్, సైనస్ తలనొప్పి లను తగ్గించడంలో కూడా హిట్ ప్యాడ్ ఉపయోగ పడుతుంది. ఇక కంప్యూటర్ స్క్రీన్ చూసేటప్పుడు యాంటీ గ్లేర్ గ్లాసెస్ వాడడం చాలా మంచిది. ఇంకా ఎలాంటి మానసిక ఒత్తిడి గాఢంగా నిద్ర పోవడం కూడా తలనొప్పిని తగ్గిస్తుంది. కాబట్టి ఉదయాన్నే మేడిటేషన్, యోగా వంటివి చేయడం అలవాటు చేసుకోవాలి. ఇవి మనసును ఉల్లాసంగా ఉంచుతూ తలనొప్పిని దూరం చేస్తాయి.

 

- Advertisement -