ప్రతి వారం లాగే, ఈ వారం కూడా మూడు సాలిడ్ సినిమాలు ఈగల్, లాల్ సలాం, యాత్ర 2 రిలీజ్ అయ్యాయి. మరి బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రాల పరిస్థితేంటి ?, ఏ చిత్రం విజయాన్ని అందుకుంది ?, ఏ చిత్రం చేతులు ఎత్తేసింది ? చూద్దాం రండి. ముందుగా మాస్ మహారాజ్ రవితేజ నటించిన ఈగల్ చిత్రం నేడు విడుదలైంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకుడిగా రెండో సినిమా అయిన ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కానీ, ఫస్ట్ హాఫ్ అంతగా ఆకట్టుకోలేదు. సెకండ్ హాఫ్ మాత్రం బాగానే తీశాడు. రవితేజ తన నటనతో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. బీజీఎం బాగుంది. ఓవరల్ గా మాస్ ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది.
ఇక మరో సినిమా విషయానికి వస్తే.. మతాన్ని నమ్మితే మనసులో ఉంచుకో మానవత్వాన్ని అందరితో పంచుకో అనే కాన్సెప్ట్ తో సూపర్ స్టార్ రజినీకాంత్ కీలక పాత్రలో నటించిన లాల్ సలాం నేడు విడుదలైంది. చాలా ఏళ్ల తర్వాత దర్శకత్వం వహించిన రజినీ కూతురు ఐశ్వర్య కొంత ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఐతే, ఆమె విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. ముఖ్యంగా కథను చెప్పే విధానంలో ఆమె విఫలమయ్యారు. రజనీ ఎంట్రీ సీన్ మూవీకే హైలెట్ గా నిలుస్తుంది. ఆయన నటన భాషా సినిమా గుర్తు చేస్తుంది.
అలాగే, యాత్ర సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన మూవీ యాత్ర-2. జగన్ జీవితం ఆధారంగా మహి వి.రాఘవ్ తెరకెక్కించిన మూవీ నిన్న విడుదలైంది. జగన్ పాత్రలో హీరో జీవా తన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. సినిమాలో చాలా ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. ఈ చిత్రం మొత్తం జగన్ పాదయాత్ర చుట్టే తిరుగుతుంది. 2019 ఎన్నికల్లో YCP ఘన విజయంతో సినిమా ముగుస్తుంది. ఓవరల్ గా యాత్ర-2 మంచి ప్రయత్నంగా చెప్పవచ్చు. ఇక ఈ సినిమా చూసిన పలువురు వైసీపీ నేతలు దర్శకుడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మొత్తానికి ఈ వారం యాత్ర 2 విజయాన్ని సాధించింది.
Also Read:మెగ్నీషియం లోపిస్తే.. ఇన్ని సమస్యలా?