సంక్రాంతి కానుకుగా ఈగల్‌

45
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో రూపొందించిన ‘ధమాకా’తో తన కెరీర్‌లో బిగ్గెస్ట్ సోలో హిట్‌ అందుకున్నారు. సినిమాటోగ్రాఫర్ నుంచి దర్శకుడిగా మారిన కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో చేయబోతున్న మాసీవ్ ప్రాజెక్ట్ కోసం రవితేజ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ హౌస్‌తో మళ్లీ కలిసి పని చేస్తున్నారు. మేకర్స్ ఈ రోజు సినిమా టైటిల్‌ను ఒక గ్లింప్స్ ద్వారా విడుదల చేశారు. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది.

రవితేజ మోస్ట్ వాంటెడ్ పెయింటర్. అతన్ని పట్టుకోవడానికి ‘రా’ ఏజెన్సీ వెదుకుతుంటుంది. ఇంతలో ఓ వ్యక్తి.. అతను పత్తి పండించే రైతు అని చెబుతాడు. తనకి ఇంకొన్ని అవతారాలు కూడా ఉన్నాయి. చివరగా రవితేజ ఒక సరస్సు దగ్గర నిలబడి పాక్షికంగా తన ముఖాన్ని చూపిస్తారు. ఆ తర్వాత ‘ఈగల్’ అనే టైటిల్‌ని రివీల్ చేశారు. టైటిల్ స్ట్రైకింగ్ గావుంది. గ్లింప్స్ కథానాయకుడి ప్రపంచాన్ని ఎస్టాబ్లెస్ చేసింది. ఇందులో అనుపమ పరమేశ్వరన్, నవదీప్ , మధుబాల వంటి ప్రముఖ తారాగణం కూడా కనిపించారు. కావ్యా థాపర్‌ మరో కథానాయిక. విజువల్స్ అత్యద్భుతంగా ఉన్నాయి. నేపధ్యం సంగీతం కూడా ఎక్స్ టార్డినరిగా వున్నాయి.

కార్తీక్ ఘట్టమనేని రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మణిబాబు కరణంతో పాటు దర్శకుడు స్వయంగా స్క్రీన్ ప్లే రాశారు. టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఈ హైబడ్జెట్ ఎంటర్‌టైనర్ కోసం, టాప్ టెక్నీషియన్లు పని చేస్తున్నారు. మణిబాబు కరణం డైలాగ్స్ అందించిన ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని ఎడిటర్, సినిమాటోగ్రాఫర్ కూడా. దవ్‌జాంద్ సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీనాగేంద్ర తంగల ప్రొడక్షన్ డిజైనర్.

Also Read: ఫీల్ అవుతోన్న కీర్తి సురేష్

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. గ్లింప్స్ ద్వారా నిర్మాతలు ఈగల్‌ని 2024 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు.

Also Read: నటితో అతని బంధం అదే

- Advertisement -