ఈగల్…కాన్సెప్ట్ పోస్టర్ అదుర్స్

53
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ ఇంటెన్స్ అండ్ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఈగల్’ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో సంక్రాంతి విడుదలకు సిద్ధమవుతోంది. సినిమా టీజర్‌ని విడుదల చేసి ప్రమోషన్స్‌ను ప్రారంభించి కాన్సెప్ట్ పోస్టర్ ని విడుదల చేశారు. ఈ పోస్టర్ చాలా వైవిధ్యంగా, ఆసక్తికరంగా వుంది. పోస్టర్‌లో రవితేజ ఎప్పిరియన్స్ ఎక్స్ ట్రార్డినరీ గా వుంది. పోస్టర్ కాన్సెప్ట్ సినిమా టైటిల్ ఈగల్ ని జస్టిఫికేట్ చేస్తోంది. ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచుతోందనడంలో సందేహం లేదు.

ఇటివలే విడుదలైన ఈగల్ టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్ వస్తోంది. టీజర్ నేషనల్ వైడ్ గా వైరల్ అయ్యింది. మాస్ మహారాజా రవితేజ డిఫరెంట్ గెటప్స్, షేడ్స్, ఇంటెన్స్ స్క్రీన్ ప్రజెన్స్ తో అద్భుతంగా ఆలరించారు.అత్యుత్తమ సినిమాటోగ్రాఫర్‌లలో ఒకరైన కార్తీక్ ఘట్టమనేని తన అద్భుతమైన టేకింగ్‌తో డైరెక్షన్‌లో తన నైపుణ్యాన్ని చూపించారు. ప్రిమైజ్, నెరేటివ్ ప్రామెసింగ్ గా వున్నాయి. కార్తీక్, కమిల్ ప్లోకీ, కర్మ్ చావ్లాతో కలిసి క్యాప్చర్ చేసిన కెమెరా బ్లాక్‌లు అద్భుతంగా ఆకట్టుకున్నాయి. డేవ్ జాంద్ చేసిన అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విజువల్స్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ప్రొడక్షన్ డిజైనర్ శ్రీనాగేంద్ర తంగాల మాస్టర్ వర్క్ ఆకట్టుకుంది

మణిబాబు కరణం ఈ సినిమాకి మాటలు అందించారు. ఈగల్ చిత్రానికి కథనంలో దర్శకుడితో భాగం పంచుకున్న మణిబాబు కరణం గత ఏడాది అందరి మన్ననలు పొంది విజయం అందుకున్న ‘కార్తికేయ2’ కి సంభాషణలు సమకూర్చారు. ఈగల్ టీజర్ లో వినిపించిన “కొండలో లావాని కిందకి పిలవకు… ఊరు ఉండదు…నీ ఉనికి వుండదు ”అనే డైలాగ్ వైరల్ అవుతోంది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని అత్యున్నత నిర్మాణ విలువలతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈగల్ అన్ని దక్షిణ భారత భాషల్లో, హిందీలో గ్రాండ్ గా విడుదల కానుంది.

Also Read:శరీరంలో ఐరన్ లోపమా.. జాగ్రత్త?

- Advertisement -