నాన్న న‌న్నెందుకు పిల‌వ‌లేదుః రానా

273
rana-daggubati
- Advertisement -

ప్ర‌ముఖ నిర్మాత, సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ అధినేత ద‌గ్గుబాటి సురేష్ బాబు పై మండిప‌డ్డారు హీరో రానా. త‌రుణ్ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సినిమా ఈ న‌గ‌రానికి ఏమైంది. ఈసినిమాకు ప్ర‌ముఖ నిర్మాత సురేష్ బాబు నిర్మాత‌. నిన్న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా స‌క్సెస్ టాక్ తో దూసుకుపోతుంది. యూత్ పుల్ ఎంట‌టైన‌ర్ గా తెర‌కెక్కిన ఈసినిమాలో న‌లుగురు కొత్త కుర్రాళ్లను ప‌రిచ‌యం చేశాడు ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్.

Ee Nagaraniki Emaindhi

ఇక ఈసినిమా మొద‌టి షో నుంచే స‌క్సెస్ టాక్ తో దూసుకెళ్తుడ‌టంతో టీం అందరూ క‌లిసి ఒక చోట చేరి పార్టీ చేసుకున్నారు. ఈపార్టీలో సురేష్ బాబుతో పాటు, ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్, సినిమాలో న‌టించిన విశ్వ‌క్ సేన్ నాయుడు, సుశాంత్ రెడ్డి, వెంక‌టేశ్, అనీషా అంబ్రోస్, అభిన‌వ్, సిమ్రాన్ చౌద‌రి ఇలా టీం మొత్తం క‌లిసి స‌క్సెస్ ను ఎంజాయ్ చేశారు. టీం మొత్తం క‌లిసి పార్టీ చేసుకుంటున్న ఫోటోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు హీరో రానా. అంతేకాకుండా నిర్మాత సురేష్ బాబుపై ఫైర్ అయ్యారు. నాన్న నన్ను ఎందుకు పిల‌వ‌లేదు అని మెసెజ్ పెట్టాడు రానా. దింతో రానా పెట్టిన మెసెజ్  సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

- Advertisement -