రెండు రోజులే….పొడగింపు లేదు!

51
challan
- Advertisement -

రాష్ట్రంలో లక్షల్లో పెరుకుపోయిన పెండింగ్ చలాన్ల క్లీయరెన్స్‌కు పోలీసులు బంపర్ ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మార్చి 1 నుండి 31 వరకు రాయితీతో చలాన్ల చెల్లింపుకు అవకాశం కల్పించగా ఆ గడువు ఇంకా రెండు రోజులే ఉంది. ఇప్పటికే చలాన్ల క్లియరెన్స్‌కు మంచి స్పందన రాగా చివరి రెండు రోజుల్లో భారీగా పన్నులు వసూలు అయ్యే అవకాశం ఉంది.

ఇప్పటివరకు మూడు పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో సుమారు 5 కోట్ల చలాన్లు పెండింగ్‌లో ఉండగా, మార్చి 28వ తేదీ నాటికి 43 శాతం చలాన్లు వసూళ్లయ్యాయని పోలీసులు చెబుతున్నారు. బైక్లు, కార్లు, ఆటోలు, భారీ వాహనాల పెండింగ్‌ చలాన్లను డిస్కౌంట్‌తో కలిపి ఈనెల 31లోపు క్లియర్‌ చేసుకోండి. లేకపోతే ఆ తర్వాత భారీ మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

రాయితీ గడువును పొడిగించే ఆలోచన లేదని స్పష్టం చేశారు పోలీసులు. ఏప్రిల్నుంచి ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే.. ఎవరైనా సరే ఛార్జిషీట్లు వేస్తామని, పెద్ద మొత్తంలో జరిమానాలు వసూలు చేస్తామని హెచ్చరించారు.

- Advertisement -