ఇందిరా గాంధీ దేశానికే గర్వకారణం: భట్టి

4
- Advertisement -

ఇందిరా గాంధీ భారత దేశానికే గర్వకారణం అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇందిరా గాంధీ జయంతి సందర్బంగా గాంధీ భవన్ లో ఆమె చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు గీతారెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే దానం నాగేందర్ మరియు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్.

కేవలం ఒక ప్రధాన మంత్రిగానే కాకుండా దేశ ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం చూపి ఇందిరా గాంధీ గొప్ప మాతృమూర్తి గా నిలిచారు అన్నారు. దేశ అభివృద్ది, పేదల అభ్యున్నతి కోసం ఆమె తీసుకున్న నిర్ణయాలు స్ఫూర్తిదాయకం అన్నారు. ఇందిరా గాంధీ మార్గంలోనే తెలంగాణాలో ఇందిరమ్మ రాజ్యం నడుస్తోందన్నారు.

Also Read:Indira Gandhi: ఇందిరా గాంధీకి కాంగ్రెస్ నేతల నివాళి

- Advertisement -