రూమర్స్‌పై డీవీవీ దానయ్య!

5
- Advertisement -

హనుమాన్ చిత్రంతో టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు ప్రశాంత్ వర్మ. అయితే ఈ దర్శకుడి గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రశాంత్ వర్మ తాను పూర్తి చేయని ప్రాజెక్టుల కోసం పలువురు ప్రముఖ నిర్మాతల నుండి రూ. 80–100 కోట్ల వరకు అడ్వాన్స్‌లు తీసుకుని తిరిగి ఇవ్వలేదని ప్రచారం జరుగుతోంది.

అలాగే, ప్రశాంత్ వర్మ PVCU వెంచర్స్‌లో మరీ ఎక్కువగా నిమగ్నమై, తన స్టూడియోలో భారీగా పెట్టుబడులు పెట్టారని, అందువల్ల ఆయనపై ఇండస్ట్రీ చాంబర్ నుండి చర్యలు తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

నిర్మాత డీవీవీ దానయ్య పేరు కూడా ఈ వదంతుల్లో వినిపించింది. దీనిపై స్పష్టత ఇవ్వడానికి, డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ఒక ప్రకటన విడుదల చేసింది. దర్శకుడు ప్రశాంత్ వర్మ మరియు డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ మధ్య ఎలాంటి ఆర్థిక లావాదేవీలు, ఒప్పందాలు లేదా వృత్తిపరమైన సంబంధం లేవని స్పష్టంగా తెలిపారు. అలాగే మీడియా సంస్థలు వాస్తవాలను ధృవీకరించకుండా ఎవరి పేర్లనైనా ప్రచారం చేయకుండా ఉండాలని కోరారు.

ఇక మరోవైపు, ప్రశాంత్ వర్మ ప్రస్తుతం డీవీవీ దానయ్య కుమారుడు కల్యాణ్ దాసరి హీరోగా నటిస్తున్న తొలి చిత్రం “అధీర”**కు క్రియేటర్‌గా పనిచేస్తున్నారు.

Also Read:Kohli:జెమీమా పోరాటం అద్భుతం

- Advertisement -