దువ్వాడ జగన్నాథం టీజర్

190
Duvvada Jagannadham Teaser
- Advertisement -

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ‘దువ్వాడ జగన్నాథమ్‌’ సినిమా టీజర్‌ విడుదలైంది. మహాశివరాత్రి సందర్భంగా విడుదల చేసిన ఈ టీజర్‌లో అల్లు అర్జున్‌ బ్రాహ్మణుడి గెటప్‌లో సందడి చేస్తున్నారు. నుదుట నామాలు.. చేతిలో రుద్రాక్ష దండ.. పొద్దున్నే నియమంగా హారతులు.. అబ్బో.. ఈ బ్రాహ్మణుడి లెక్కే వేరు. స్టయిలిష్ స్టార్ అల్లు  అర్జున్ ఇప్పుడు స్వచ్ఛమైన బ్రాహ్మణుడిలా మారిపోయాడు.

రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటోంది. ‘ఇలా ఇలా ముద్దులు పెట్టేసి సభ్య సమాజానికి ఏం మెసేజ్‌ ఇద్దామని’ అంటూ బన్నీ చెప్పే డైలాగ్‌ సరదాగా అనిపిస్తోంది. హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్దే కథానాయికగా నటిస్తోంది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

- Advertisement -