దసరా కానుకగా ‘శాతకర్ణి’ టీజర్‌

285
- Advertisement -

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ఫస్ట్‌ ఫ్రేమ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి.బ్యానర్‌పై నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ మూవీ డైరెక్టర్‌ జాగర్లమూడి క్రిష్‌ దర్శకత్వంలో వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. నందమూరి బాల‌కృష్ణ న‌టిస్తున్న 100వ చిత్రం కావ‌డం, తెలుగు జాతి ఔన‌త్యాన్ని ప్రపంచానికి చాటిన తెలుగు చ‌క్రవ‌ర్తి గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి ఆధారంగా రూపొందుతున్న చిత్రం కూడా కావ‌డంతో సినిమా ప్రారంభం నుంచే భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ అంచ‌నాల‌కు త‌గ్గట్టు ద‌ర్శకుడు క్రిష్‌, నిర్మాత‌లు వై.రాజీవ్‌రెడ్డి, జాగ‌ర్లమూడి సాయిబాబులు సినిమా గ్రాండ్‌గా తెర‌కెక్కిస్తున్నారు.

goutami

ఈ ప్రతిష్టాత్మక‌మైన చిత్రానికి సంబంధించి గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణిగా బాల‌కృష్ణ‌, వశిష్టిదేవిగా శ్రియాశ‌ర‌న్ ప్రీలుక్స్‌‌కు ఇటు నందమూరి అభిమానులు, అటు తెలుగు ప్రేక్షకుల‌కు నుంచి ట్రెమెండెస్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్పుడు గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి సినిమాకు సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌డానికి బాల‌య్య ముహుర్తాన్ని నిర్ణయించారు. అక్టోబ‌ర్ 9న శాత‌క‌ర్ణిగా బాల‌కృష్ణ రాయ‌ల్ లుక్ విడుద‌ల కానుండ‌గా, స‌క‌ల విజ‌యాల‌ను క‌లుగు జేసే విజ‌య‌ద‌శ‌మి రోజు అంటే అక్టోబ‌ర్ 11 ఉద‌యం 8 గంట‌ల‌కు ఈ సినిమా టీజ‌ర్ విడుద‌ల కానుంది.

balakrishna

మొరాకోలో మొదటి షెడ్యూల్ ని, సెకండ్ షెడ్యూల్ ను హైదరాబాద్ చిలుకూరు సమీపంలో వేసిన భారీ యుద్ధనౌక సెట్ లోనూ పూర్తి చేశారు. ఇప్పుడు జార్జియాలో క్లైమాక్స్ చిత్రీకరణ పూర్తైంది. బాలకృష్ణ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో హేమామాలిని, శ్రియ, కబీర్ బేడి తదితరలు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: బిబో శ్రీనివాస్, సినిమాటోగ్రాఫర్: జ్ఞాన శేఖర్, ఆర్ట్: భూపేష్ భూపతి, సంగీతం: చిరంతన్ భట్, సాహిత్యం: సీతారామశాస్త్రి, మాటలు: సాయిమాధవ్ బుర్రా, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, సహ నిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వరరావు, నిర్మాతలు: వై. రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు.

balaiah

- Advertisement -