డమ్మీ అన్నలు…తప్పిన ప్రమాదం..!

247
maoist
- Advertisement -

పోలీసులు.. మావోయిస్టుల మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఛత్తీస్‌గఢ్‌లో ఒకరిపై ఒకరి దాడులతో మన్యం తుపాకుల మోతతో దద్దరిల్లిపోతోంది. ముఖ్యంగా మావో ప్రభావిత ప్రాంతమైన దంతెవాడ జిల్లాలో భద్రత బలగాలు అడుగడుగు జల్లెడ పడుతున్నాయి. ఈ క్రమంలో పోలీసుల భద్రత బలగాలకు పెను ప్రమాదం తప్పింది.

ఆపరేషన్ గ్రీన్ హంట్‌లో కూంబింగ్ నిర్వహిస్తున్న బలగాలకు చెట్ల మాటు నుంచి గన్‌ పట్టుకున్న మావోయిస్టులు కనిపించారు. వెంటనే ఫైరింగ్ చేసేందుకు భద్రత బలగాలు సిద్ధం అయ్యాయి. అయితే ఎంతసేపటికి మావోలుగా పోలీసులు భావిస్తున్న వారిలో ఎలాంటి చలనం లేదు.

దీంతో భద్రత బలగాలు దగ్గరికి వెళ్లి చూడగా చెట్ల పొదల్లో మావోల వేషధారణలో రెండు బొమ్మలున్నాయి. తుపాకీ పట్టుకుని మావోయిస్టులు నిలబడినట్టుగా బొమ్మలను అమర్చారు. ఆ రెండు బొమ్మలను పరిశీలిస్తే.. ఒకదాన్లో ఏడు కిలోల పేలుడు పదార్థాలు ఉన్నట్టు గుర్తించారు. ఒకవేళ బొమ్మలే నిజమైన మావోయిస్టులనుకుని బలగాలు ఫైరింగ్ జరిపి ఉంటే.. ఆ బొమ్మలు పేలిపోయేవి. పెద్ద ప్రాణనష్టం జరిగేది. కానీ భద్రతా బలగాలు చూపించిన చొరవతో పెను ప్రమాదం తప్పింది.

- Advertisement -