ప్రభాస్ ‘కల్కి’లో మరో స్టార్ హీరో

41
- Advertisement -

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న కొత్త చిత్రం ‘కల్కి 2898 AD’. తాజాగా ఈ మూవీ గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో ఇప్పటికే దీపికా, కమల్ హాసన్, అమితాబ్, దిశా పటాని, రానా వంటి స్టార్ నటులు కీలక పాత్రలు పోషిస్తుండగా తాజాగా మరో యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా నటిస్తున్నట్లు సమాచారం. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఈ సినిమాలో దుల్కర్ నటిస్తే.. మలయాళంలో కూడా ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ వస్తాయి.

ఇక చిత్రం విడుదల వాయిదా పడనుందనే వార్తలు సోషల్ మీడియాలో వైరలవుతున్న సంగతి తెలిసిందే. దీనిపై నాగ్‌ అశ్విన్‌ కూడా స్పందించాడు. ‘‘కల్కి’ షూటింగ్‌ ఇంకా కొంతభాగమే మిగిలుంది. త్వరలోనే పూర్తి చేస్తాం. కాబట్టి కల్కి సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశం లేదు. కాకపోతే.. ప్రభాస్ పార్ట్ కి సంబంధించి సిజీ వర్క్ ఇంకా చాలా ఉంది. పైగా ఇది చాలా సమయం పడుతుందట. ఒకవేళ గ్రాఫిక్స్ కి టైమ్ తీసుకుంటే.. అప్పుడు రిలీజ్ డేట్ ను వాయిదా వేయక తప్పదు.

ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే అమితాబ్ బచ్చన్ గురువు పాత్రలో నటించనున్నాడు. కమల్ – ప్రభాస్ పాత్రల మధ్య వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ అద్భుతంగా ఉంటాయట. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫ‌స్ట్ గ్లింప్స్‌ అందర్నీ ఆకట్టుకుంది. ముఖ్యంగా అదిరిపోయే యాక్ష‌న్ సీక్వెన్స్‌, హాలీవుడ్‌కు ధీటైన‌ గ్రాఫిక్స్ హంగుల‌తో విజువ‌ల్ ఫీస్ట్‌గా ఈ ఫ‌స్ట్‌ గ్లింప్స్ అభిమానుల‌ను మెస్మరైజ్ చేసింది.

Also Read:బాలయ్య ఫ్లాప్ మూవీస్…రీ రిలీజ్!

- Advertisement -