నన్ను గుర్తుపట్టలేదా…నేను దుబాయి క్రౌన్‌ ప్రిన్స్‌

114
dubai
- Advertisement -

రాజు అంతపురానికే పరిమితం కాదని ప్రజల్లో తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకున్నప్పుడే నిజమైన రాజు అంటారు పెద్దలు. అలాంటి రాజు రాజభోగాలు వదిలి ప్రజల నడుమ తిరిగారు. ప్యాలెస్‌లో సకల సౌకర్యాలు ఉంటాయి. అడుగు బయటపెట్టినా భద్రత దృష్ట్యా వారు ప్రత్యేకంగా కార్లు, విమానాలు, హెలికాప్టర్‌లలో తిరుగుతుంటారు. అయితే వీటికి భిన్నంగా దుబాయి క్రౌన్‌ ప్రిన్స్‌ మెట్రోలో ప్రయాణించారు. అంతేగాక తోటి ప్రయాణికులు అతన్ని యువరాజుగా గుర్తు పట్టకపోవడం మరో పెద్ద విశేషం.

దుబాయి యువరాజు షేక్‌ హమ్దాన్‌ బిన్‌ మహ్మద్‌ అల్‌ మక్తూమ్‌ తన కుటుంబం, స్నేహితులతో కలిసి లండన్‌ వెకేషన్‌లో ఉన్నారు. హాలిడే ట్రిప్‌కు సంబంధించిన ఫోటోలను 14 మిలియన్ల ఫాలోవర్స్‌ కలిగిన తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఈ ఫోటోల్లో యువరాజు లండన్‌లోని అండర్‌ గ్రౌండ్‌ మెట్రోలో సామాన్యుడిలా ప్రయాణించారు. షేక్ హమ్దాన్ తన స్నేహితుడు బద్ర్‌ అతీజ్‌తో కలిసి నిత్యం రద్దీగా ఉండే లండన్ మెట్రో కంపార్ట్‌మెంట్ మధ్యలో నిల్చొని సెల్ఫీ దిగారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి. కాగా దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ విలాసవంత ప్రయాణాన్ని వదిలేసి ఇలా మెట్రోలో సామాన్య పౌరుడిగా ప్రయాణించడాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

- Advertisement -