బసవన్నలకు తగ్గని ఆదరణ

1207
gangireddulu
- Advertisement -

పండగొచ్చిందంటే చాలు.. మన ముంగిళ్లలోకి వచ్చి సందడి నింపుతారు.. సంస్క..తి, సాంప్రదాయాలు పల్లె లొగిల్లోకి మోసుకొస్తారు.. గుమ్మాల ముందు ఆడతారు.. పాడతారు.. ఆడిస్తారు.. అమ్మవారికి దణ్ణంపెట్టు.. అయ్యవారికి దణ్ణంబెట్టు.. పెద్ద సారుకు దణ్ణంపెట్టు..’ ఈ మాటలు వినగానే అందరికీ గంగిరెద్దులు గుర్తుకొస్తాయి. ఇంటింటికీ తిరిగి పిల్లలను, పెద్దలను అలరించే గంగిరెద్దులు (బసవన్నలు) సంక్రాంతికి కొత్త శోభ తెస్తాయి.సంక్రాంతి సమయంలో గంగిరెద్దుల వాళ్లు నాదస్వరంతో పాడే పాటలు, తబలా వాద్యం, రంగురంగుల దుస్తులతో గంగిరెద్దులకు చేసే అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. వారికి డబ్బులు, పాతవస్తువులు, బియ్యం వంటివి జనం ఇస్తుంటారు.

gangireddu

నేటి ఆధునిక పోకడల్లో గంగిరెద్దులు అంటేనే ప్రస్తుత తరానికి తెలియకుండా పోయింది. పల్లెల్లో సైతం గంగిరెద్దులు ఆడించే వారికి ఆదరణ కరవు అవడంతో ఆయా కుటుంబాలు వలసలు పోగా మిగిలిన వారు కూలీలుగా జీవిస్తున్నారు.గంగిరెద్దులతో చేసే విన్యాసాలు చూపరుల చేత చప్పట్లు కొట్టించినా.. వాటిని ఆడించే వారికి మాత్రం ప్రాణ సంకటమే..! పెద్ద పులి పట్టు, మెడపట్టు, రొమ్ము పొట్టపై గంగిరెద్దులను ఎక్కించుకునే ప్రదర్శనలు మనల్ని ఔరా అనిపిస్తాయి. కానీ ఆ విన్యాసాలతో విసుగెత్తి ఆగ్రహంతో వాడైన కొమ్ములతో ఎద్దులు పొడిచే ప్రమాదాలు లేకపోలేదు.

gangiredulu

పట్ణణాలు, గ్రామాలకు విసిరిపడేసినట్లు దూరంగా పాకలు వేసుకొని గంగిరెద్దును తిప్పుకొనే వారికి ఇప్పుడు నివాస స్థలాల్లేవు. గంగిరెద్దులను మేపుకొనేందుకు కాసింత స్థలమూలేదు. గంగిరెద్దులను పోషించుకోలేక ఆ వృత్తిని విడిచి ప్లాస్టిక్‌, సిల్వర్‌ సామాన్లు అమ్ముకొని జీవిస్తున్నారు. పనులు, వ్యాపారం చేసే శక్తిలేని వారు భిక్షాటన చేసుకొని బతుకు వెళ్లదీస్తున్నారు.

- Advertisement -