మాజీ సీఐకి సెల్యూట్ కొట్టిన డీఎస్పీ..!

495
ci madhav
- Advertisement -

ఎగ్జిట్ పోల్స్‌కు అందని రీతిలో కనీవిని ఎరగని రీతిలో విజయాన్ని అందుకుంది వైసీపీ. అనుభవం ట్యాగ్‌తో బరిలోకి చంద్రబాబు టీడీపీని గెలిపించలేకపోయారు. 2014లో కొద్దిలో ఓటమి పాలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఈసారి బంపర్ మెజార్టీతో విజయం సాధించింది.

ఇక వైసీపీ అధికారంలోకి వచ్చినా అందరి చూపు మాత్రం హిందుపూర్‌ ఎంపీ స్ధానంపైనే ఉంది. సీఐగా పనిచేస్తూ సీనియర్ నేత జేసీ దివాకర్‌ రెడ్డికి సవాల్ విసిరిన మాధవ్‌..తన ఉద్యోగానికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. చివరివరకు తన నామినేషన్‌ అమోదంపై హైడ్రామా నెలకొనడంతో కోర్టును ఆశ్రయించి రిలీఫ్‌ పొందిన ఆయన ఎన్నికల్లో సత్తాచాటారు. టీడీపీ సీనియర్ నేత నిమ్మల కిష్టప్పను మట్టికరిపించి భారీ మెజార్టీతో గెలుపొందారు.

ఈ నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రం వద్ద ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.సీఐగా పనిచేస్తున్న సమయంలో తన పై అధికారి డీఎస్పీకి సెల్యూట్ చేసిన మాధవ్,ఇప్పుడు ఎంపీగా ఎన్నికై అదే డీఎస్పీనుంచి సెల్యూట్ తీసుకున్నాడు.దీనికి ప్ర‌తిగా- మాధ‌వ్ కూడా ఆప్యాయంగా సెల్యూట్ చేశారు. ప్రస్తుతం ఎంపీ మాధవ్-డీఎస్పీ సెల్యూట్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

- Advertisement -