డీఎస్సీ అభ్యర్థుల నిరసన కార్యక్రమం మరింత ఉదృతమైంది. డీఎస్సీని వాయిదా వేయాలని వర్షాన్ని సైతం లెక్క చేయకుండా, దిల్‍సుఖ్‍నగర్ మెట్రో స్టేషన్ వద్ద ప్లకార్డులతో ఆందోళన చేపట్టారు డీఎస్సీ అభ్యర్థులు. మంత్రులతో మాట్లాడమని సీఎం చెప్తున్నాడు కాని ఏ మంత్రి కూడా తమని పట్టించుకోవడం లేదని..ఇదంతా ఒక నాటకమని ఆరోపించారు నిరుద్యోగులు.
ఇక నిరుద్యోగులను కించపరిచేలా కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది.ఒళ్లు బలిసి దీక్షలు చేస్తున్నరు. తిన్నది అరగక చేస్తున్నరు. వీళ్లకు పనీపాటా లేదు. నిరుద్యోగుల ముసుగులో దొంగ దీక్షలు చేస్తున్నారు అని కాంగ్రెస్ నేత చనగాని దయాకర్ అహంకారపూరిత వ్యాఖ్యలు చేయడంపై తెలంగాణ సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలనే అడుగుతున్నామని, ఆ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఎంతో కృషిచేసిన తమను నయవంచనకు గురిచేసిందని మండిపడుతున్నారు. రెండుమూడు రోజుల క్రితం తలకుమాసినోళ్లే దీక్షలు చేస్తున్నరని మాట్లాడిన రేవంత్ రెడ్డి శనివారం జేఎన్టీయూ వేదికగా మరోసారి నిరుద్యోగులపై అక్కసు వెళ్లగక్కిన సంగతి తెలిసిందే.
Also Read: