మందుతాగి రెండోసారి పట్టుబడితే…. అంతే!

144
Drunk and Drive
- Advertisement -

కరోనా నేపథ్యంలో గ్రేటర్ పరిధిలో దశలవారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేసిన దగ్గరి నుండి రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్‌లో తొలిసారి పట్టుబడితో భారీగా ఫైన్ విధిస్తుండగా రెండోసారి పట్టుబడితే డ్రైవింగ్ లైసెన్స్‌ శాశ్వతంగా రద్దవుతుందని సైబరాబాద్ పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీల్లో మొదటిసారి పట్టుబడితే రూ.10 వేల జరిమానా‌, 6 నెలలు జైలు శిక్ష, 3 నెలలు లైసెన్స్ రద్దు చేస్తామని తెలిపారు పోలీసులు. రెండోసారి పట్టుబడితే రూ.15 వేల జరిమానాతో పాటు రెండేళ్ల జైలు శిక్ష, శాశ్వతంగా లైసెన్స్ రద్దు చేస్తామన్నారు.

పర్మినెంట్‌గా లైసెన్స్‌ రద్దయితే సదరు వ్యక్తి వాహనం నడిపే అర్హత కోల్పోతాడని లైసెన్స్‌ లేకుండా పట్టుబడితే కేసు నమోదు చేయడంతోపాటు వాహనాన్ని సీజ్‌ చేస్తామన్నారు.

- Advertisement -