డ్రంక్ అండ్ డ్రైవ్…టైమింగ్స్ ఛేంజ్!

213
Drunk-and-Drive
- Advertisement -

కరోనా,లాక్ డౌన్ తర్వాత పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లతో రోడ్డు ప్రమాదాలు తగ్గగా మందు కొట్టి వాహనాలను నడుపుతూ పట్టుబడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది.

అయితే హైదరాబాద్‌ పరిధిలో సాయంత్రం నుంచే డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు చేస్తున్నారు. దీంతో అన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్‌ సమస్య తలెత్తుతోంది. ఈ విషయంలో వాహనదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఉన్నతాధికారులు స్పందించారు. రాత్రి 9:30 గంటల తర్వాతనే డ్రంకెన్‌ డ్రైవ్‌ పరీక్షలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -