డ్రగ్స్‌కు బానిసైన ఆ నటి.. ఎక్కడికైనా వస్తుంది !

225
Drugs rocket in tollywood
Drugs rocket in tollywood
- Advertisement -

టాలీవుడ్ లో డ్రగ్స్ రాకెట్ గట్టు రట్టవడంతో.. ఇన్నాళ్లు గుట్టుగా డ్రగ్స్‌ వాడిన సదరు సినీ ప్రముఖులు భయంతో వణికిపోతున్నారు. కెల్విన్ ముఠా వెల్లడించిన డ్రగ్ వినియోగదారులు, పెడ్లర్ల జాబితాతో పోలీసులు ఆశ్చర్యపోతున్నారు. ఇందులో భారీ ఎత్తున టాలీవుడ్ లింకులు బట్టబయలయ్యాయి. డ్రగ్స్ తీసుకునే సినీ నటులందరికీ గచ్చిబౌలిలోని ఒక పబ్ అడ్డా అని అధికారులు గుర్తించారు. ముగ్గురు యువ నటులు, ముగ్గురు స్టార్ నటులు, ముగ్గురు హీరోయిన్లు, ఒక స్టార్ దర్శకుడు ఇలా చాలా మందికి డ్రగ్స్ సరఫరా చేశానని కెల్విన్ వివరించినట్టు సమాచారం. అంతేకాదు షాకింగ్ నిజాలు బయటపెట్టినట్లు తెలుస్తోంది.

మత్తుమందుల వ్యాపారంలో ఆరితేరిన కెల్విన్‌ మెల్లగా ఓ దర్శకుడితో పరిచయం చేసుకున్నాడు. క్రమంగా పరిచయాలను విస్తరించుకుంటూ అనేకమందికి సరఫరా చేయడం మొదలుపెట్టాడు. కెల్విన్‌ ఫోన్‌ను విశ్లేషించినప్పుడు వెల్లడైన వివరాలు చూసి అధికారులు కంగుతిన్నారు. ప్రధానంగా ఒక మాజీ హీరోయిన్‌ ఎల్‌ఎస్డీ(ఖరీదైన మత్తు మందు)కి పూర్తిగా బానిసైందని చెప్పిన కెల్విన్‌ ‘ఆమె నేను పిలిస్తే ఎక్కడికంటే అక్కడికి వస్తుంది. ఇప్పుడు పిలిపించమంటారా?’ అనడంతో ఆబ్కారీ అధికారులు షాకయ్యారు. ఐటమ్‌ పాటలకు ప్రసిద్ధి చెందిన మరో నటి అయితే మత్తుమందుల కోసం రకరకాలుగా ఒత్తిడి చేసేదని కెల్విన్ వెల్లడించాడట. ఎల్‌ఎస్డీకి అలవాటుపడ్డ మిగతావారి పరిస్థితి కూడా ఇంతేనని పోలీసులు చెబుతున్నారు.

సినీ పరిశ్రమకు చెందిన వారి పేర్లు ఉండడంతో మూడో కంటికి తెలియకుండా పక్కా ఆధారాలు సేకరించారు ఆబ్కారీ అధికారులు. కెల్విన్‌ ముఠా ఫోన్‌ వివరాలు, సంభాషణలతోపాటు వివిధ సందర్భాల్లో వీరు కలిసిన కొన్ని వీడియో దృశ్యాలు కూడా సేకరించి పెట్టారు. కెల్విన్‌ తదితరుల నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ఎక్కడెక్కడ కలుసుకునేవారు, మత్తుమందులు ఎలా అందుకునేవారు, ఎలా సంభాషించుకునేవారు తదితర వివరాలన్నీ సేకరించారు. దీన్నంతా ఒకటికి రెండుసార్లు పునఃసమీక్షించుకున్నారు.నోటీసులు అందుకున్న వారిలో తమకు అందిన మత్తుమందు ఒకరితో ఒకరు పంచుకునేవారని, ఇది కూడా పంపిణీ కిందికే వస్తుందని అధికారులు నిర్ధారణకు వచ్చారు. నోటీసులు అందుకున్న ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా హాజరుకావాల్సిందేనని, ఎవరైనా గైర్హాజరైతే చట్టపరంగా చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, దానికి తగ్గట్టుగానే వ్యూహం రూపొందించామని అధికారులు చెబుతున్నారు.

సినీ పరిశ్రమలో చాలాకాలంగా మాదకద్రవ్యాల వాడకం పరాకాష్ఠకు చేరుకుందని, ఇటీవల ఒక యువ సంగీత దర్శకుడు ఎల్‌ఎస్డీ ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్లనే చనిపోయినట్లు అధికారులు గుర్తించారు. ఇతనికీ కెల్వినే సరఫరా చేసేవాడని పోలీసులు గుర్తించారు. ఆ సంగీత దర్శకుడు చనిపోయినప్పుడు తన పని అయిపోయినట్లేనని, తనను అరెస్టు చేస్తారేమోనని భయపడ్డానని కెల్విన్‌ దర్యాప్తు అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది. ఇదొక్కటే కాదని, ఎల్‌ఎస్డీ వాడుతున్న చాలామంది ఇప్పుడు అది లేకపోతే ఉండలేని పరిస్థితికి చేరుకున్నారని అధికారులు చెబుతున్నారు.

ఇక టాప్‌పొజిషన్‌లో ఉన్న మరో యువహీరో తన డ్రైవర్‌ ద్వారా కొకైన్‌ తెప్పించుకునే వాడని సమాచారం. ఆ ఇద్దర్నీ అరెస్టు చేసేందుకు ఇప్పటికే ఆబ్కారీ అధికారులు ఉచ్చు బిగించినట్లు తెలుస్తోంది. తెలుగు సినీ పరిశ్రమలో మాదకద్రవ్యాల వినియోగం ప్రమాదకరస్థాయికి చేరుకుందని, ఇది మరింత విస్తరిస్తోందని, ఇలాగే వదిలేస్తే చేయిదాటిపోయే ప్రమాదం ఉందని భావిస్తున్న అధికారులు కఠిన చర్యలకు సిద్ధమయ్యారు.

- Advertisement -