డ్రోన్లతో కరీంనగర్ పోలీసుల వినూత్న ప్రయత్నం..

358
drone
- Advertisement -

నూతన ఒరవడిని కొనసాగించడంలో తమకు తామే సాటి గా నిలుస్తూ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్, కర్ఫ్యూ లను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ పటిష్టమైన చర్యలతో శాంతిభద్రతల తీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ముందుకు సాగుతున్నారు కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలు,కమాండ్ కంట్రోల్ వాహనం ద్వారా కమిషనరేట్ వ్యాప్తంగా వినియోగించి సామాజిక దూరం పాటించకుండా, గుంపులుగుంపులుగా జమాకూడి ఉన్న జనాలను చెదర కొడుతున్నారు.

ఒకవైపు వివిధ కోణాల్లో డ్రోన్ల వినియోగం, మరోవైపు కమాండ్ కంట్రోల్ వాహనంతో లాక్ డౌన్, కర్ఫ్యూ లను పర్యవేక్షిస్తూ సదరు ప్రాంతాల్లో ఉన్న పోలీసు సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ పూర్తిస్థాయిలో టెక్నాలజీని వినియోగిస్తున్నారు. కరీంనగర్ లోని వివిధ ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా జమ గుడి ఉన్న జనాన్ని గుర్తించడం, అక్కడికి వేగవంతంగా పోలీసు బృందాలను పంపించి వారిని అదుపులోకి తీసుకోవడం, చెదరగొట్టడం, వాహనాలను సీజ్ చేయడం లాంటి చర్యలను కఠినంగా అమలు పరుస్తున్నారు.

ఎటు నుండి డ్రోన్ కెమెరాలు వస్తున్నాయో, కమాండ్ కంట్రోల్ వాహనం ద్వారా ఎక్కడెక్కడి ప్రాంతాలను పరిశీలిస్తున్నారో అంటూ జనం ఆకాశం వైపు చూస్తూ ఇళ్ళలోనే స్వీయనిర్బధంలో ఉంటున్నారు. డ్రోన్ కెమెరాల వినియోగం, కమాండ్ కంట్రోల్ వాహనం లాంటి అత్యాధునికమైన ఆధునిక సాంకేతిక పరికరాల వినియోగంతో సఫలీకృతం అవుతున్నారు కమిషనరేట్ పోలీసులు. టెక్నాలజీ వినియోగంలో తమకు తామే సాటి అంటూ ప్రతిరోజు నిరూపిస్తూ శాంతిభద్రతలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సదరు ప్రాంతాలకు చేరుకుని నియంత్రణ చర్యలు తీసుకుంటున్నారు. పోలీసులు తీసుకుంటున్న చర్యలను అన్ని వర్గాల ప్రజలు స్వాగతిస్తున్నారు.

- Advertisement -