ట్రంప్‌పై డ్రోన్‌ దాడి జరగొచ్చు..

9
- Advertisement -

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ పై డ్రోన్‌తో దాడి చేసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్‌ సుప్రీంలీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ సలహాదారు జావద్‌ లారిజాని మాట్లాడుతూ ఈ మేరకు ట్రంప్‌ను హెచ్చరించారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఇకపై ఆయన ఫ్లోరిడా లోని మార్‌-ఎ-లాగో నివాసం సురక్షితం కాదు అన్నారు. అక్కడ ఆయన సన్‌బాత్‌ చేసే సమయంలో డ్రోన్‌ దాడి జరగొచ్చు. ఇది చాలా ఈజీ అని తెలిపారు.

2020లో ఇరానియన్‌ టాప్‌ జనరల్‌ ఖాసిం సులేమానీ హత్యలో ట్రంప్‌ పాత్రను ప్రస్తావిస్తూ ఈ హెచ్చరికలు చేశారు. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీని లక్ష్యంగా చేసుకున్నా ప్రతీకారం తప్పదని తీవ్రంగా హెచ్చరించారు. ఇరాన్‌ – అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో డ్రోన్ దాడి కామెంట్స్ కలకలం రేపాయి.

Also Read:బెట్టింగ్ యాప్స్ కేసు..ఈడీ ఎంటర్!

- Advertisement -