ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా “డ్రింకర్ సాయి”. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మించారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ నెల 27న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చిన “డ్రింకర్ సాయి” సినిమా యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ఆదరణతో విడుదలైన అన్ని చోట్ల విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈరోజు “డ్రింకర్ సాయి” సినిమా సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో యాక్టర్ రాజేశ్ వుల్లి మాట్లాడుతూ – మా “డ్రింకర్ సాయి” సినిమాను సక్సెస్ చేసిన ఆడియెన్స్ కు థ్యాంక్స్. నేను నా ఫ్యామిలీతో కలిసి ఈ మూవీ చూసేందుకు థియేటర్ కు వెళ్లాను. మూవీ క్లైమాక్స్ లో మా వైఫ్ ఎమోషనల్ గా ఫీలై ఏడవటం చూశాను. మా మూవీ యూత్ తో పాటు మహిళలకు బాగా నచ్చుతోంది. మా మూవీని మరింతగా ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
డీవోపీ ప్రశాంత్ అంకిరెడ్డి మాట్లాడుతూ – “డ్రింకర్ సాయి” సినిమాకు వస్తున్న టాక్ చూస్తుంటే హ్యాపీగా ఉంది. డీవోపీగా నాకు “డ్రింకర్ సాయి” సినిమా మంచి పేరు తీసుకొచ్చింది. మా నాన్న ఫోన్ చేసి మూవీ చాలా బాగుంది, గర్వంగా ఉంది అని చెప్పారు. మహిళలు మా మూవీకి బాగా కనెక్ట్ అవుతున్నారు. ఇలాంటి మంచి చిత్రాలకు మీరు ఇంకాస్త ఆదరణ ఇస్తే మరిన్ని చిన్న చిత్రాలు రూపొందే అవకాశం ఉంటుంది. మరో 40, 50 మంది కొత్త వాళ్లకు అవకాశాలు వస్తాయి. మూవీ చూడనివారు థియేటర్స్ కు వెళ్లి “డ్రింకర్ సాయి” సినిమా చూడాలని కోరుతున్నా. అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ శ్రీవసంత్ మాట్లాడుతూ – “డ్రింకర్ సాయి” సినిమాకు మేము ఆశించినట్లే మంచి రెస్పాన్స్ వస్తోంది. నా ఫ్రెండ్, డైరెక్టర్ కిరణ్ కు కంగ్రాట్స్, అలాగే టీమ్ అందరికీ నా విశెస్ చెబుతున్నా. ఈ సినిమాను ఎంతవరకు ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లాలో అంత వరకు మా ప్రొడ్యూసర్స్ ప్రయత్నం చేశారు. డే 1 మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. సినిమా చూసిన ఆడియెన్స్ వాళ్లంతట వాళ్లే వచ్చి మేము మా రెస్పాన్స్ చెబుతాం అని ముందుకొస్తున్నారు. కథ విన్నప్పుడే ఈ సాంగ్స్ ఇలా ఉండాలని డిజైన్ చేసుకున్నాం. చంద్రబోస్ గారు ఇచ్చిన లిరిక్స్ అద్భుతంగా కుదిరాయి. మీరు ఫ్యామిలీతో కలిసి “డ్రింకర్ సాయి” సినిమా చూడాలని రిక్వెస్ట్ చేస్తున్నా. అన్నారు.
ప్రొడ్యూసర్ బసవరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ – నేను ఈ మూవీకి ప్రొడ్యూసర్ అయినా ఫస్ట్ టైమ్ మీడియా ముందుకు వస్తున్నాను. భారత సేవా సహకార ఫోరమ్ అనే సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నా. లాక్ డౌన్ లో నేను చేసిన సేవలకు మాస్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే అవార్డ్ వచ్చింది. పద్మశ్రీ పురస్కారానికి ఫైనల్ లిస్ట్ దాకా నా పేరు వెళ్లింది. ఇలాంటి నేపథ్యమున్న నేను డ్రింకర్ సాయి టైటిల్ తో సినిమా చేసినప్పుడు కొందరు మిత్రులు సందేహాలు వెలిబుచ్చారు. కానీ ఈ సినిమా ద్వారా ఒక మంచి సందేశాన్ని ఇస్తున్నామని వారికి చెప్పాను. మంత్రి శ్రీధర్ బాబు గారు మా మూవీ పోస్టర్ లాంఛ్ చేశారు. డ్రింకర్ సాయి సినిమాకు మంచి వసూళ్లు వస్తున్నాయి. మేము పెట్టిన పెట్టుబడి సేఫ్ అయ్యింది. లాభాలు కూడా వస్తాయి. అయితే వీటన్నింటికంటే ఒక మంచి సందేశాత్మక సినిమా చేశామనే సంతృప్తి ఉంది. డైరెక్టర్ కిరణ్ ను సెట్ లో చూశాను. ఎంతో డెడికేటెడ్ గా, ప్రతిభావంతంగా పనిచేశాడు. అలాగే హీరో ధర్మ ప్రతి పనిలో తాను ఇన్వాల్వ్ అయి చేశాడు. హీరోయిన్ ఐశ్వర్యను మా సొంత అమ్మాయిలా చూసుకున్నాం. మా అబ్బాయి లహరిధర్ ప్రొడక్షన్ పనులన్నీ చూసుకున్నాడు. అలాగే ఇస్మాయిల్ ప్రొడక్షన్ లో భాగమయ్యారు. మా టెక్నీషియన్స్ అంతా ప్యాషనేట్ గా వర్క్ చేశారు. మా “డ్రింకర్ సాయి” సినిమాకు విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. అన్నారు.
Also Read:TGSRTC: సంక్రాంతికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు