యూత్ ఎంజాయ్‌ చేసే..”డ్రింకర్ సాయి”

3
- Advertisement -

ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “డ్రింకర్ సాయి”. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మిస్తున్నారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ నెల 27న ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అ‌వుతోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో “డ్రింకర్ సాయి” సినిమా హైలైట్స్ నిర్మాత బసవరాజు లహరిధర్ తెలిపారు.

– సినిమా ఇండస్ట్రీ మేము గతంలో ఎప్పుడూ వర్క్ చేయలేదు. మా నాన్న బసవరాజు శ్రీనివాస్ పీఆర్ పీ పార్టీలో కీలకంగా ఉండేవారు. అప్పటినుంచి చిరంజీవి గారితో నాన్నకు పరిచయం ఉంది. “డ్రింకర్ సాయి” సినిమా సన్నాహాల్లో ఉన్నప్పుడు చిరంజీవి గారికి కథ గురించి చెప్పాం. ఆయన కథ గురించి తెలుసుకుని ఓకే ప్రొసీడ్ అన్నారు. అలా మెగాస్టార్ చిరంజీవి గారి ప్రోత్సాహంతో “డ్రింకర్ సాయి” సినిమా ప్రారంభించాం. మా చిత్రంలోని సాంగ్స్ ను ఆయనకు చూపిస్తే బాగున్నాయంటూ అప్రిషియేట్ చేశారు.

– 2019లోనే ఈ మూవీ పనులు మొదలుపెట్టాం. కోవిడ్ వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. గతేడాది షూటింగ్ బిగిన్ చేశాం. మొదట్లో అనుకున్న కథకు కొన్ని మార్పులు చేసి దర్శకుడు కిరణ్ ఈ చిత్రాన్ని రూపొందించారు. కిరణ్ గారు మారుతి గారి దగ్గర వర్క్ చేశారు. ఆయన రైటింగ్ సైడ్ ఉండేవారు. ఈ చిత్రంతో దర్శకుడిగా మారుతున్నారు. ఈ సినిమాను ఎంతో డెడికేటెడ్ గా రూపొందించారు కిరణ్.

– కథ అనుకున్నప్పుడు హీరోగా ధర్మ బాగుంటాడు అనిపించింది. డ్రింకర్ సాయి క్యారెక్టర్ కు యాప్ట్ అయ్యాడు ధర్మ. ఆయన సత్యానంద్ గారి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడు. ఈ క్యారెక్టర్ బాగా పర్ ఫార్మ్ చేశాడు. హీరోయిన్ ఐశ్వర్య శర్మది జమ్మూ. ఆమె ఆడిషన్ చూసి తీసుకున్నాం. బాగీ క్యారెక్టర్ లో ఐశ్వర్య ఆకట్టుకునేలా నటించింది.

– రిలీజ్ కు మంచి డేట్ దొరికిందనే భావిస్తున్నాం. ఈ 27న ఎక్కువ సినిమాలు రావడం లేదు. ఏపీలో డిస్ట్రిబ్యూటర్స్ కు ఇచ్చాం. నైజాంలో ఓన్ రిలీజ్ చేస్తున్నాం. థియేటర్స్ కూడా బాగానే లభిస్తున్నాయి. సెన్సార్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. సినిమా ఫస్టాఫ్ లోనే యూత్ ఫుల్ ఎలిమెంట్స్ ఉంటాయి. సెకండాఫ్ నుంచి ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా ఇంప్రెస్ అయ్యేలా స్టోరీ ఉంటుంది. ఆడియెన్స్ ను థియేటర్స్ కు అట్రాక్ట్ చేసేందుకే ప్రమోషనల్ కంటెంట్ లో కొంత యూత్ ఫుల్ ఎలిమెంట్స్ రివీల్ చేశాం. ఈ లవ్ స్టోరీలో మంచి మెసేజ్ కూడా ఉంటుంది.

– సినిమా ప్రొడక్షన్ పరంగా గ్రాండ్ గా ఉండాలనే ప్రయత్నించాం. చిన్న సినిమాను ఏదోలా రిలీజ్ చేయాలని అనుకోలేదు. శ్రీవసంత్ మ్యూజిక్ కు మంచి పేరొస్తోంది. పాటలు హిట్ అయ్యాయి. హేషబ్ వహాబ్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ తో సాంగ్ పాడించాం. అందరు పెద్ద సింగర్స్ తోనే సాంగ్స్ పాడించాం. అలాగే ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ గారు సింగిల్ కార్డ్ రాశారు. మ్యూజిక్ మా మూవీకి మంచి ఆకర్షణ అవుతోంది.

Also Read:TTD: రెండు గంటల్లో స్వామివారి దర్శనం

– ప్రెజెంట్ ఇండస్ట్రీలో చిన్న చిత్రాలకు థియేట్రికల్, ఓటీటీ బిజినెస్ పరంగా డల్ గానే ఉంది. అయితే కంటెంట్ బాగున్న చిత్రాలను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తున్నారు. మా సినిమా కంటెంట్ మీద కూడా నమ్మకం ఉంది. సక్సెస్ అందుకుంటామనే ఆశిస్తున్నాం. ప్రస్తుతం ఈ సినిమా మీదే దృష్టి పెట్టాం. “డ్రింకర్ సాయి” రిలీజ్ తర్వాత కొత్త ప్రాజెక్ట్స్ కోసం సన్నాహాలు ప్రారంభిస్తాం.

- Advertisement -