డ్రీమ్ ఫార్మర్స్ …ప్రొడక్షన్ నెం.4

28
- Advertisement -

ప్రియమణి నటించిన భామాకలాపం ఫ్రాంచైజీ, విశ్వక్ సేన్ అశోక వనంలో అర్జున్ కళ్యాణం సినిమాలతో డ్రీమ్ ఫార్మర్స్ బ్రాండ్ పెరిగింది. అలాంటి ప్రొడక్షన్ కంపెనీ నుంచి మరో కొత్త చిత్రం రాబోతోంది. ఈరోజు ఆ క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. ఈటీవీ విన్‌ సహకారంతో డ్రీమ్‌ ఫార్మర్స్‌ బ్యానర్‌పై బాపినీడు & సుధీర్‌ ఈదర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ ప్రాజెక్ట్‌లో సీనియర్ నటుడు నరేష్ విజయ్ కృష్ణ, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని ప్రధాన పాత్రలు పోషించనున్నారు. లెజెండరీ కమెడియన్, నటుడు బ్రహ్మానందం గారు కీలక పాత్రలో నటిస్తున్నారు. గురువారం (జనవరి 25) నాడు అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలతో ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో దర్శకులు రవికిరణ్ కోలా, రాధా కృష్ణ, భరత్ కమ్మ తదితరులు పాల్గొన్నారు. క్రియేటివ్ ప్రొడ్యూసర్ తన్మయ్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, చిత్రనిర్మాత రాధ క్లాప్‌ కొట్టారు. ఈ చిత్రానికి అనురాగ్ పాలుట్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి ఆర్ హెచ్ విక్రమ్ సంగీతం అందిస్తుండగా అంకుర్ సి సినిమాటోగ్రఫర్‌గా పని చేస్తున్నారు. హరీష్ శంకర్ టిఎన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

Also Read:TTD:రామకృష్ణ తీర్థ ముక్కోటి

- Advertisement -