దటీజ్… ద్రావిడ్

238
Dravid at his best
- Advertisement -

భారత క్రికెట్ వాల్‌గా రాహుల్ ద్రావిడ్ అందించిన విజయాలు ఇప్పటికి ఎవరు మర్చిపోలేరు. జట్టు తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పుడు…ఓటమి అంచుల్లో ఉన్నప్పుడు ఒక్కడే వాల్‌గా నిలిచి టీమిండియాకు చిరస్మరణీయ విజయాలను అందించాడు. ఇక అండర్ 19 క్రికెట్ జట్టు కోచ్‌గా భారత్‌ వరల్డ్ కప్‌ గెలవడంలో ద్రావిడ్ పాత్ర మరువలేనిది. ద్రావిడ్‌ ప్రతిభా పాఠవాలపై అంతా ప్రశంసలు గుప్పించారు. బీసీసీఐ కూడా ఆటగాళ్లతో పాటు కోచ్‌ ద్రావిడ్‌కు భారీ నజరానా ప్రకటించింది.

ద్రవిడ్‌కు బీసీసీఐ రూ.50 లక్షల ప్రైజ్ మనీ..క్రికెటర్లకు రూ.30 లక్షల చొప్పున, సిబ్బందికి రూ.20 లక్షల చొప్పున ప్రైజ్ మనీ ఇస్తున్నట్టు ప్రకటించింది. అయితే,బీసీసీఐ ప్రకటించిన ప్రైజ్ మనీపై రాహుల్ పెదవి విరిచారు. జట్టు విజయంలో అందరిపాత్ర ఉందని అందరికి సమానంగా ప్రైజ్ మనీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేగాదు అండర్-19 జట్టు విజయం కోసం తమ వంతు కృషి చేసిన పాత సిబ్బందికి కూడా నజరానా ఇవ్వాలని కోరాడు.

dravid

ద్రావిడ్ డిమాండ్‌తో ఆలోచనలో పడ్డ బీసీసీఐ అందరికీ సమానంగా రూ. 25 లక్షల చొప్పున నగదు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. సపోర్టింగ్ స్టాఫ్‌ మరింతమందికి ఈ ప్రోత్సాహకం అందించాలని నిర్ణయిస్తూ మరింతమందిని జాబితాలో చేర్చింది. అంతేగాదు తనకు వస్తోన్న రూ. 25 లక్షలను టీమ్ ట్రైనర్ రాజేష్ సావంత్ కుటుంబానికి ఆర్థిక సాయంగా అందజేసి తన పెద్దమనసు చాటుకున్న ద్రావిడ్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

- Advertisement -