యువ హీరో శర్వానంద్ ఇటీవల విడుదలైన నారీ నారీ నడుమ మురారి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం నేటి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. శర్వానంద్ తదుపరి చిత్రం ‘బైకర్’, అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా.
ఈ సినిమా విడుదల తేదీని ఇటీవలే ఏప్రిల్ 3, 2026గా ప్రకటించిన చిత్రబృందం, నేడు డా. రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక గ్లింప్స్‌ను విడుదల చేసింది.
ఈ గ్లింప్స్‌లో డా. రాజశేఖర్ పోషిస్తున్న పాత్ర …‘బుల్లెట్ సునీల్’పై ప్రధానంగా ఫోకస్ చేశారు. ఒకప్పుడు మోటోక్రాస్ రేసర్‌గా ఉన్న ఈ పాత్ర, భారతీయ రైడర్లు రేసింగ్ చాంపియన్‌షిప్ గెలవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుండడం గ్లింప్స్‌లో కనిపిస్తుంది. ఎనర్జీతో నిండిన ఈ వీడియో సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. సినిమాలో రాజశేఖర్ పాత్ర ప్రధాన ఆకర్షణగా నిలవనుందని తెలుస్తోంది.
ఈ చిత్రంలో మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తోంది. వంశీ కృష్ణ రెడ్డి, ఉప్పలపాటి ప్రమోద్‌లు యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తుండగా, సంగీతాన్ని గిబ్రాన్ అందిస్తున్నారు.
Also Read:మున్సిపల్ ఎన్నికల్లో పవన్ ప్రచారం

