డాక్టర్ కేశవులును అభినందించిన మంత్రి జగదీష్ రెడ్డి

87
Dr.Keshavulu
- Advertisement -

అంతర్జాతీయ విత్తనాభివృద్ది సంస్థ (IFTA) అధ్యక్షుడుగా డాక్టర్ కేశవులు నియమితులైయ్యారు. స్వీట్జర్ ల్యాండ్ కేంద్రంగా IFTA ప్రపంచ వ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న విషయం విదితమే. తెలంగాణ విత్తనాభివృద్ది సంస్థ యండి గా విధులు నిర్వహిస్తున్న కేశవులు స్వగ్రామం సూర్యాపేట జిల్లా నాగరం మండల కేంద్రం. ఆసియా ఖండంలోనే మొట్టమొదటి సారిగా అంతర్జాతీయ స్థాయిలో IFTA చైర్మన్‌గా నియమితులైనారు డాక్టర్ కేశవులు.

అంతర్జాతీయ స్థాయిలో అరుదైన అవకాశం పొందిన కేశవులు బుధవారం హైదరాబాద్‌లో రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి ఆయనను ఘనంగా సత్కరించారు. తెలంగాణను విత్తన భాండాగారంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్ప సిద్ధికి IFTA తోడ్పాటు అందించే విధంగా కేశవులు ముందుకు సాగాలను మంత్రి జగదీష్ రెడ్డి సూచించారు.

- Advertisement -