మిసైల్ మ్యాన్, పీపుల్స్ ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం జయంతి నేడు. అవుల్ పకీర్ జైనులాబ్దిన్ అబ్దుల్ కలాం తమిళనాడులోని రామేశ్వరంలో గల పేద ముస్లీం కుటుంబంలో 15 అక్టోబర్, 1931న జన్మించారు.
ఎనిమిది సంవత్సరాల వయస్సులో న్యూస్ పేపర్లు వేయడం ద్వారా తన మొదటి సంపాదనను ఆర్జించారు. మద్రాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి కలాం పిజిక్స్, ఏరోస్పేస్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. అనంతర కలాంలో డీఆర్‌డీవో, ఇస్రోలో చేరి ఇండియా మిసైల్ మ్యాన్‌గా ఎదిగారు.
కార్నిజియా మెలాన్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్‌బర్గ్‌తో పాటుగా 48 యూనివర్సిటీల గౌరవ డాక్టరేట్‌లు కలాంను వరించాయి. విద్యార్థులతో సమావేశమై చర్చించడం కలాం అత్యంత ఇష్టమైన పనుల్లో ఒకటి. కలలు కనండని ఎల్లప్పుడు పిలుపునిచ్చే కలాం చిన్న కలలను కనడం నేరంగా పేర్కొనేవారు. తన కెరీర్ తొలినాళ్లలో ఉపాధ్యాయుడిగా పని చేసిన అబ్దుల్ కలాం.. ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యాక 2001లో చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో టెక్నాలజీ, సొసైటల్ ట్రాన్ఫ్‌ఫర్మేషన్ ప్రొఫెసర్‌గా చేరారు.
2002 నుంచి రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. పెద్ద లక్ష్యాన్ని పెట్టుకుని ఛేదించాలని యువతకు పిలుపునిచ్చారు. 83 ఏండ్ల వయస్సులో జూలై 27, 2015న ఐఐఎం షిల్లాంగ్‌లో ప్రసంగిస్తూ కలాం కన్నుమూశారు. అందరి హృదయాల్లో గుర్తుండే కలాంను మరోసారి స్మరించుకుందాం.