- Advertisement -
హైదరాబాద్ నగరంలో మూడు ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎస్ శాంతి కుమారి, ఎంపీ రంజిత్ రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ పాల్గొన్నారు. ప్రస్తుతం మూడు బస్సులు ప్రారంభించగా…త్వరలోనే 20కి పెంచనున్నట్టు తెలిపారు. దీనిలో భాగంగా ఒక్కో ఎలక్ట్రిక్ బస్సు ధర రూ.2.16కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. ఈ డబుల్ డెక్కర్ బస్సులు డ్రైవర్‌తో పాటు 65మంది ప్రయాణికులు సీటింగ్ సామర్థ్యం ఉంది. ఈ బస్సు ఒకసారి ఛార్జింగ్ చేస్తే 150కిలోమీటర్లు ప్రయాణించవచ్చని 2 నుంచి 2.5 గంటల్లో పూర్తిగా ఛార్జింగ్ పూర్తవుతుందని అధికారులు తెలిపారు. ఈ నెల 11న ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, ప్యారడైజ్, నిజాంకాలేజీ ప్రాంతాల్లో తిరుగనున్నట్టు హెచ్‌ఎండీఏ ప్రకటించింది.
ఇవి కూడా చదవండి…
పట్నంకు వచ్చిన డబుల్ డెక్కర్ బస్సులు..
ఉపాధ్యాయుల బదిలీలకు కీలక నిర్ణయం..
అప్పుల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్
- Advertisement -