నేటిరోజుల్లో చాలమందిని వెన్నునొప్పి సమస్య వేధిస్తూ ఉంటుంది. ఎందుకంటే రోజంగా కంప్యూటర్ ముందు కూర్చొని పని చేయడం వల్ల వెన్నెముకపై అధిక ప్రభావం పడి వెన్నునొప్పికి దారి తీస్తుంది. అయితే వెన్ను నొప్పి రావడానికి ఇంకా చాలానే కారణాలు ఉన్నాయి. ఒకే భంగిమలో ఎక్కువసేపు కూర్చోవడం, శారీరక శ్రమ లేకపోవడం, ఎముకల బలహీనత ఇలా చాలా కారణలే వెన్ను నొప్పికి దారి తీస్తాయి. అయితే వెన్నునొప్పిని సాధారణ సమస్యే అని తేలిగ్గా తీసుకోరాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని రకాల క్యాన్సర్లలలో కూడా వెన్ను సమస్య భాదిస్తుంది. అందువల్ల వెన్ను నొప్పి సమస్యను తేలికగా తీసుకుంటే క్యాన్సర్ ను గుర్తించలేము. .
ఫలితంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. మూత్రశాయ క్యాన్సర్ ఉన్నవారిలో కూడా వెన్నునొప్పి సమస్య కనిపిస్తుంది. సాధారణంగా మూత్రశాయ క్యాన్సర్ ఉన్నవారిలో పొత్తికడుపులో నొప్పి ఉంటుంది. అదే టైమ్ లో వెన్నులో సూదులతో గుచ్చినట్లు నొప్పి వస్తుంది. దీనిని నడుం నొప్పిగా భావించరాదని వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంకా వెన్ను క్యాన్సర్ ఉన్నవారిలో కూడా నడుం నొప్పి ఎక్కువగా కనిపిస్తుంది.
దీనితో పాటు తుంటి భాగంలో నొప్పి, మోకాళ్ళు, అరికాళ్ళలో నొప్పి వంటి లక్షణాలు కూడా వెన్ను క్యాన్సర్ కు సూచనలే. ఇంకా ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్న కొందరిలో కూడా వెన్నునొప్పి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి రకరకాల క్యాన్సర్ లలో కూడా వెన్ను నొప్పి సహజలక్షణంగా ఉంటుంది కాబట్టి వెన్ను నొప్పిని తేలికగా తీసుకోరాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణ వెన్నునొప్పిని తగ్గించుకోవడానికి ప్రతిరోజూ వ్యాయామం చేయడం ఉత్తమం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Also Read:మహిళా బిల్లుతో వచ్చే మార్పేంటి?