విద్యా బాలన్ గ్లామర్ ప్రదర్శన దెబ్బకు బాలీవుడ్డే కాదు టాలీవుడ్ అండ్ కోలీవుడ్ ఫ్లాటై పోయాయి. విద్యాబాలన్ తన “డర్టీ పిక్చర్”తో ఒక్కసారిగా అందాలను బట్టబయలు చేసి అందరి దృష్టిని ఆకర్షించేసింది.
అయితే ఈ భామ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి విద్యాబాలన్ వస్త్రధారణ గురించి, ఆమె శరీరం గురించి పలు విమర్శలు ఎదురవుతూనే ఉన్నాయి. ఓ పబ్లిక్ ఫంక్షన్‌లో ఆమె వస్త్రధారణ గురించి షారూక్ బహిరంగంగానే వ్యంగ్యంగా మాట్లాడాడు. అలాగే ఆమె చాలా లావుగా ఉంటుందని, సగటు బాలీవుడ్ హీరోయిన్‌కు ఉండాల్సిన లక్షణాలు ఆమెకు లేవని విమర్శకులు వ్యాఖ్యానిస్తూ ఉంటారు.
తాజాగా అలాంటి విమర్శలపై విద్యా బాలన్ స్పందించింది. గ్లామర్‌గా కనిపించాలంటే సన్నబడాలా? సన్నగా ఉంటేనే అవకాశాలొస్తాయా? అయినా, నేను ప్రస్తుతం బరువు తగ్గాల్సిన అవసరం లేదు. నాకు వస్తున్న పాత్రలకు నాజూకుగా ఉండాలని రూలేం లేదు. ఈ విషయంలో ముందు మీ మైండ్ సెట్ మారాలి. తగ్గాల్సింది నేను కాదు’’ మొదటి నుంచి కూడా నేను బొద్దుగానే వుంటాను .. నా శరీర తత్వమే అంత. నేను చేసిన పాత్రలను గురించి .. నా నటన గురించి మాట్లాడండి. అంతేగాని నా శరీరాకృతి గురించి మాట్లాడతారెందుకు? నా నిర్మాతలకి లేని బాధ .. నా అభిమానులకు లేని ఇబ్బంది మీకెందుకు?. నేను సన్నబడటమనేది జరగదు .. కాబట్టి నేను లావుగా వున్నానంటూ చేసే కామెంట్ల వలన ఎలాంటి ఉపయోగం ఉండదు. లావుగా వున్నవారిపై సినిమాల్లో కామెడీ చేయడం కూడా నాకు నచ్చదు” అంటూ స్పష్టం చేసింది. అని ఘాటుగా స్పందించడం చర్చనీయాంశమైంది.