ఇటీవల బాలకృష్ణ తన కొత్త సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో అసిస్టెంట్ ను కొడుతూ.. అతడితో బూట్లు విప్పించుకుంటూ కెమెరాల కంటపడ్డారు. ఒకసారి తన అభిమాని సెల్ఫీ తీసుకుంటుండగా ఫోన్ నేలకు కొట్టి బాలకృష్ణ వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పుడు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సతీమణి జయాబచ్చన్ కూడా బాలయ్య స్టైల్‌లో రెచ్చిపోయింది.
వివరాళ్లోకి వెళ్తే.. ముంబైలోని మహా గణపతిని దర్శించుకునేందుకు ఆమె ఓ ఆలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆమెతో సెల్ఫీ దిగేందుకు ఓ అభిమాని యత్నించాడు. దీంతో, ఇబ్బందికి గురైన జయ… కొన్ని క్షణాలపాటు అతనిపై కోపంగా చూశారు. ఆ తర్వాత ‘అలా చేయకు.. బేవకూఫ్’ అంటూ ఘాటుగా మందలించారు. గతంలో కూడా ఒక ఆలయంలో జయ ఇదే విధంగా ప్రవర్తించారు. అప్పుడు ఆమెతో సెల్ఫీ దిగేందుకు ఓ పూజారి ప్రయత్నించాడు. దీంతో జయ, ‘సెల్ఫీ కాదు… పూజపై దృష్టి పెట్టండి’ అని చెప్పారు. తన దుందుడుకు స్వభావంతో తరచుగా వార్తల్లో నిలవడం సాధారణ విషయమే. తాజాగా ఆమె మరోసారి నోటికి పని చెప్పారు. బాలయ్య హిందూపురం ఎమ్మేల్యేగా ఉండగా.. జయ బచ్చన్ రాజ్య సభగా కొనసాగుతున్నారు.
https://youtu.be/eOCmqPVhHd8